సీఎం  వైయ‌స్ జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ గాడిలో పెట్టారు

వైయ‌స్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ

గుంటూరు:సీఎం  వైయ‌స్‌ జగన్‌ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారని వైయ‌స్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17నెలల్లోనే అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టారని వైయ‌స్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. సాంబశివ రావుపేటలో గుంటూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90శాతం పైగా కేవలం అధికారంలోకి వచ్చిన 15నెలల లోపు అమలు చేశామని ఆయన తెలిపారు.

బాబు రాష్ట్ర ఆదాయాన్ని సొంత జాగీరుగా వాడుకున్నారు

ముఖ్యమంత్రిగా వైయ‌స్ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేదని, చంద్రబాబు రాష్ట్ర ఆదాయాన్ని సొంత జాగీరుగా వాడుకుని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం వైయ‌స్‌ జగన్‌ కేవలం 17నెలల్లోని గాడిలో పెట్టారని గుర్తుచేశారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1.40లక్షలకు పైగా లబ్ధి పొందాలని మహిళలు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావుతో పాటు ఎమ్మెల్యే ముస్తఫా, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్ గాంధీ తదితరులు పాల్గొ‍న్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top