అణగారిన వర్గాలకు నామినేటెడ్‌ పదవుల్లో సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట

ఎంపీ మోపిదేవి వెంకటరమణ
 

విజయవాడ: అణగారిన వర్గాలకు నామినేటెడ్‌ పదవుల్లో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయ చరిత్రలోనే విప్లవాత్మక మార్పులకు, చరిత్రాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. పరిపాలన, వ్యవస్థ పరంగా, సంస్థాగతంగా మార్పులు మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి గత పాలకులు వాగ్ధానాలు ఇచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారు. వారి జీవన విధానం, ఆర్థిక పరిస్థితిలో ఎక్కడా కూడా సరైన గౌరవం, గుర్తింపు లేదు. గతానికి భిన్నంగా ఈనాటి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అణగారిన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పథంలో జీవనశైలిని మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ పదవులు, సంక్షేమ పథకాల అమలు, ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్లు, మార్కెట్‌ కమిటీలు, చివరకు రాజ్యసభ పదవుల్లో కూడా 50 శాతం బీసీలకు కేటాయించారు. 56 మంది బీసీ వర్గాల వారిని నియమించి గౌరవం ఇచ్చారు. బీసీ వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించారు. ఈ వర్గాల వారు అందరూ కూడా రానున్న రోజుల్లో వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే మా భవిష్యత్‌లు బంగారు బాటలో పయనిస్తాయని భావిస్తున్నారు. అందరూ కూడా ముక్తకంఠంతో వైయస్‌ జగన్‌ నాయకత్వానికి అండగా ఉన్నారు. రేపటి రోజు కూడా అండగా ఉంటారు. పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top