వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత

రైతులను ఆదుకునేందుకే ధరల స్థిరీకరణ నిధి

మంత్రి మోపిదేవి వెంకటరమణ

అమరావతిః 2004కు ముందు పాలకులు  వ్యవసాయం దండగ అని అన్నారని..ముఖ్యమంత్రిగా వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత  వ్యవసాయం పండగను చేసి చూపించారని పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దగా పడుతున్న రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రాయితీలు కల్పించి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించారని తెలిపారు.రైతు పక్షపాతిగా వైయస్‌ఆర్‌  గుర్తింపుపోందారని తెలిపారు.టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులకు గురిఅయ్యారని తెలిపారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో అనేక ప్రాంతాల్లో పర్యటించి  రైతుల కష్టాలు తెలుసుకున్నారన్నారు.

ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులు అన్ని విధాల మోసపోతున్నారని,రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. గత ఐదేళ్లలో రైతులు 2004కు ముందు పరిస్థితులు చూశారన్నారు.రైతులను ఆదుకునేందుకు సీఎం జగన్‌ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.వైయస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top