11న అనంత‌పురంలో సమర శంఖారావం

మాజీ ఎంపీ అనంత వెంక‌ట్రామిరెడ్డి
 

అనంతపురం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల 11న అనంతపురంలో సమర శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా నేత‌లు మాట్లాడుతూ  ర్టీ అధినేత ఈ నెల 6న తిరుపతి నుంచి సమర శంఖారావాన్ని పూరించారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 11న సభ నిర్వహిస్తామన్నారు. ఉదయం 11 గంటలకుఅన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా తటస్థులతో సమావేశం ఉంటుందన్నారు.

సమర శంఖారావం సభ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు, సామాన్యులకు భరోసాను కల్పించే దిశగా కార్యక్రమం సాగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లతో సమీక్షిస్తారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పార్టీ సమన్వయకర్తలు వై.వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగే పరశురాం, మహాలక్ష్మి శ్రీనివాస్, నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్‌ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top