పేద ప్ర‌జ‌ల దైవం ..వైయ‌స్ఆర్‌

సినీ న‌టుడు, వైయ‌స్ఆర్‌సీపీ నేత మోహ‌న్ బాబు 
 

హైద‌రాబాద్‌:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేద ప్ర‌జ‌ల దైవ‌మ‌ని సినీ న‌టుడు, వైయ‌స్ఆర్‌సీపీ నేత మోహ‌న్‌బాబు కొనియాడారు.  వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈ సందర్భంగా  మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. వైయ‌స్ఆర్ స్నేహశీలి అని కొనియాడారు. మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు వైయ‌స్సార్ నిలువెత్తు నిదర్శనం అని అభివర్ణించారు."పేద ప్రజల దైవం మా బావగారైన వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
 

Back to Top