న్యాయ, శాసన వ్యవస్థల్లో ఏది గొప్ప? అన్నదానిపై చర్చ జరగాలి

కోర్టులకు అవసరమైన కేసులే చూస్తున్నారు

ప్రజలకు అవసరమైన అంశాలను టేబుల్‌ మీదకు తీసుకోవడంలేదు

రాష్ట్ర విభజనలో అన్యాయంపై ఇప్పటివరకు ఎందుకు తీర్పు ఇవ్వలేదు

అసెంబ్లీ తీర్మానాన్ని ఆరునెలల్లో అమలుచేయాలని ఎక్కడ ఉంది? 

2019లో ‘గల్లా’ ఎన్నికపై కేసువేస్తే ఇప్పటివరకూ స్పందించలేదు

మాజీ ఎంపీ మోదుగుల కీలక వ్యాఖ్యలు

  గుంటూరు: ప్రజలకు అవసరమైన అంశాలను న్యాయస్థానాలు టేబుల్‌ మీదకు తీసుకోవడంలేదని.. తమకు అవసరమైన వాటినే అవి పరిగణనలోకి తీసుకుంటున్నాయని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు. అవి ఇచ్చే తీర్పులు ప్రజల్లో న్యాయస్థానాలపై గౌరవం పెరిగేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డా రు. రాజధాని విషయంలో హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యా ఖ్యలు చేశారు.  మోదుగుల గుంటూరులోని ఐబీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ 2014లో విభజనవల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగితే సుప్రీం కోర్టు దానిపై ఇంకా తీర్పు ఎందుకు ఇవ్వడంలేదు? దీనిపైనా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు కదా.. అలాగే, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది.. ఆదాయంలేదు, కష్టపడి నిర్మించిన హైదరాబాద్‌ లేదు.. దీని పై తీర్పు ఇవ్వకుండా మొన్న జరిగిన మూడు రాజ ధానులపై తీర్పు ఇవ్వడమేంటి? న్యాయ వ్యవస్థపై కామెంట్‌ చేయడంలేదు.. కానీ, వాటిపై తీర్పు ఎం దుకు రాలేదు. న్యాయ వ్యవస్థ నిద్రపోతోందా? ఈ తీర్పును పునఃసమీక్ష చేయాల్సిందే. అలాగే, మూ డు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పాసైన బిల్లు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థల మధ్య పరస్పర విరుద్ధ భావనలు తలెత్తినప్పుడు రెండింటిలో ఏది గొప్ప? అన్నదానిపైనా పూర్తిస్థాయి చర్చ జరగాలి. 

‘గల్లా’ ఎన్నిక కేసు ఏమైంది?
ఇక ఎన్నికలకు సంబంధించిన కేసులు ఆర్నెళ్లలో ముగించమని చట్టంలోనే చెప్పారు.. మరి 2019 ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో నేను నాలుగువేల ఓట్లతో వెనుకబడినప్పుడు పదివేల పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కపెట్టలేదు. ఎంపీ గల్లా జయదేవ్‌ ఎన్నిక చెల్లదని కేసు వేశాం, అది ఏమైంది? దీనిపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు. జడ్జికి నచ్చి నవి టేబుల్‌పై పెట్టడం, నచ్చనివి పక్కన పెట్టడం సరికాదు. దీన్ని అంగీకరించం. మరోవైపు.. అసెంబ్లీ తీర్మానం చేసింది ఆరు నెలల్లో పూర్తిచేయమని చెబుతున్నారు, ఇది చట్టంలో ఎక్కడ ఉంది?  మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు శాసన వ్యవస్థపై గౌరవం లేకుండా జడ్జిమెంట్‌ ఇస్తుంటే ఏమవుతుంది ఈ వ్యవస్థ? జడ్జిమెంట్‌ మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుందా? లైక్స్, డిస్‌లైక్స్‌ ఉండవా? అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారా!?.. అని వేణుగోపాలరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాష్ట్ర విభజనపై తీర్పు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

Back to Top