ఎమ్మెల్సీలుగా మోపిదేవి, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఏకగ్రీవం 

 రిటర్నింగ్ అధికారి ప్రకటన

ఎమ్మెల్సీగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాలు అందుకున్న నేతలు

అమ‌రావ‌తి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాలను వారు అందుకున్నారు. ఎమ్మెల్సీల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అభినందించారు.

Back to Top