సర్వేలన్నీ మళ్లీ వైయస్‌ జగనే సీఎం అవుతారని చెబుతున్నాయి

రజనీకాంత్‌ చంద్రబాబు చేతిలో రోబో 

చంద్రబాబుది పీ-420 ఫార్ములా

"పీ-4" అంటే "పంగనామాలు, పచ్చి అబద్దాలు, పచ్చపత్రికలు, వెన్నుపోట్లు

చంద్రబాబు 3సార్లు సీఎంగా పనిచేసి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలి

మూడుసార్లు సీఎంగా పనిచేసి పేదల్ని ఎందుకు కోటీశ్వరుల్ని చేయలేదు బాబూ?

సీఎం వైయ‌స్ జగన్ ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంత.. చంద్రబాబు ఇమేజ్ అథ:పాతాళంలో..

చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ.. వైయ‌స్ జగన్‌కి క్రెడిబులిటీ ఎక్కువ

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

విశాఖ: సర్వేలన్నీ వైయస్‌ఆర్‌సీపీకే అనుకూలంగా ఉన్నాయని, మళ్లీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తెలిపారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రజనీకాంత్‌ చంద్రబాబు చేతిలో రోబోలా మారారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. చంద్రబాబు ఫెయిల్యూర్‌ లీడర్‌ అని ప్రజలకు తెలుసు అన్నారు. సీఎంవైయస్‌ జగన్‌ ప్రజాదరణ చూసి చంద్రబాబు భరించడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ ఇమేజ్‌ ఎవరెస్ట్‌ శిఖరమంతా గొప్పగా పైకి ఎదుగుతూ ఉందని, చంద్రబాబు ఇమేజీ రోజు రోజుకు అధఃపాతాలానికి వెళ్తుందన్నారు. లోకేష్‌ ప్రస్టేషన్‌ మరింతగా ఉందని మండిపడ్డారు. ప్రస్టేషన్‌లో మరింతగా దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లోకేష్‌ పాదయాత్ర జోకేష్‌ యాత్రగా మారిందని అభివర్ణించారు. టీడీపీకి అది ఒక పాడే యాత్ర అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడారు. 

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు ఖర్మయాత్ర అంటూ, లోకేష్ పాదయాత్ర అంటూ రాష్ట్రంలో తిరుగుతుంటే జనాలు రావట్లేదని ఫ్రస్టేషన్ కు గురై సీఎం వైయ‌స్‌ జగన్, శ్రీమతి వైయ‌స్‌ భారతీ మీద విమర్శలు చేస్తున్నారు. ఎన్ని పాదయాత్రలు చేసినా టీడీపీ బలపడదని చంద్రబాబుకు అర్థమైంది, జగనన్న వెనుక ప్రజలందరూ ఉన్నారు, అలాగే నేషనల్ మీడియా ఛానల్ సర్వేలో వైయస్ఆర్సీపీకి 25కు 25 ఎంపీ సీట్లు వస్తున్నాయని, నేషనల్ మీడియా సర్వేల్లోనే కాదు, తాను చేయించుకునే సర్వేల్లోనూ వైయ‌స్‌ జగన్  సీఎం అవుతారని తెలిసి, వీళ్ల యాత్రలకు జనాలు రావట్లేదని పచ్చిగా అబద్దాలు చెప్తున్నారు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నారు.

మళ్లీ సీఎం అయితే పేదల్ని కోటీశ్వరుల్ని చేస్తానని చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. మూడు సార్లు సీఎంగా పనిచేసి ఎందుకు పేదల్ని కోటీశ్వరుల్ని చేయలేదు? ప్రజల్ని కోటీశ్వరుల్ని చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మూడుసార్లు సీఎంగా పనిచేసి పేదలకు ఏం చేశారు? మూడుసార్లు సీఎంగా పనిచేసి చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక వ్యక్తిగా ఉన్నారు.. రెండు ఎకరాల నుంచి రూ.2వేల కోట్లకు ఎదిగారు.. రూ.500 కోట్లతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు. మూడుసార్లు సీఎంగా పనిచేసి పేదలకు కనీసం సెంటు భూమి అయినా పట్టా ఇచ్చారా..? ఇళ్లు కట్టించారా.? వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచారా? ఏమి చేయలేదు. అప్పుడు చేయకుండా.. ఇప్పుడు చేస్తానంటే.. ఎవరు మాత్రం నమ్ముతారు? ప్రజలు ఏమైనా మీరు ఏమి చెప్పినా నమ్మే వారిలా కనిపిస్తున్నారా? లేక ప్రజలు మీ చేతల్లో ఉన్న రోబో రజనీకాంత్ అనుకుంటున్నారా? మీరు చేసిన మోసాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.

చంద్రబాబుది పీ-420 ఫార్ములా
చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పీ-4 ఫార్ములా తీసుకొస్తారంట.. చంద్రబాబు ఫార్ములా వింటుంటే నవ్వు వస్తుంది.. ఆయనది పీ-4 ఫార్ములా కాదు.. పీ-420 ఫార్ములా .. చంద్రబాబు చెప్పే "పీ-4" అంటే "పంగనామాలు, పచ్చి అబద్దాలు, పచ్చపత్రికలు, పోట్లుఅంటే వెన్నుపోట్లు". మీరు ప్రజల్ని మభ్యపెట్టిన విషయం వారికి బాగా తెలుసు. మళ్లీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పీ- 4కు తోడుగా,  కొత్తగా విజన్- 2047 అంటున్నాడు. గతంలో కూడా  విజన్- 2020 అని ప్రజల్ని నిట్టనిలువునా మోసం చేస్తే, 2019 ఎన్నికల్లో ఇంట్లో కూర్చొపెట్టారు.. 2047 నాటికి టీడీపీ కనుమరుగైపోవడం ఖాయం. మూడుసార్లు సీఎంగా రాష్ట్రాన్ని పాలించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి పిచ్చిపిచ్చి అబద్దాలు చెబుతూ..ఫేక్ ఫార్ములాలు, ఫేక్ స్టోరీలు, ఫేక్ విజన్ లు చెబుతూ ప్రజల్ని మభ్య పెట్టడానికి ట్రై చేస్తున్నారు. చంద్ర‌బాబు ఫెయిల్యూర్ లీడర్ అనే విషయం ప్రజలకు బాగా తెలుసు.. వైయ‌స్ జగన్ ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంత గొప్పగా పైకి వెళ్తుంది.. చంద్రబాబు ఇమేజ్ క్రమేపీ అథ:పాతాళానికి వెళ్లిపోతుంది.. 

అది టీడీపీకి యమగళం
లోకేష్ ఫ్రస్టేషన్ లో మరింత దిగజారి మాట్లాడుతున్నారు.. లోకేష్ పాదయాత్ర జోకేష్ పాదయాత్రలా తయారైంది. టీడీపీకి అది పాడె యాత్ర. టీడీపీ ప్రాణం తీసే యమగళం అది.. అని ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.. పాదయాత్రకు డబ్బులు ఇచ్చినా ప్రజలు రావట్లేదని అసహనంతో లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు.. అహంకారంతో దళితుల్ని అవమానించారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అని చంద్రబాబు మాట్లాడితే.. దళితులు ఏం పీకారని లోకేష్ చాలా అవమానకరంగా మాట్లాడాడు. 

సీఎం స‌తీమ‌ణి వైయ‌స్‌ భారతీ మీద విమర్శలు చేయడానికి సిగ్గుందా.. అసలు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు, నీకు అసలు బుర్ర పనిచేస్తుందా లోకేష్? దళితుల్ని తిట్టిందిగాక.. సవాళ్లు చేయడం ఏమిటి? ఇన్ని రోజులు సీఎం వైయ‌స్‌ జగన్ అంటేనే భయం అనుకున్నాం.. ఆ ఇంట్లో ఉన్న మహిళలు అన్నా భయమే అని అర్థమవుతుంది. అసలు రాజకీయాలు మాట్లాడని భారతమ్మని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు.. భారతమ్మ మీద కామెంట్ చేస్తే ఆకాశం మీద ఉమ్మివేసినట్టు.. తిరిగి మీమీదే పడుతుంది. భారతమ్మని అవమానిస్తే రాష్ట్రంలోని మహిళలందరూ టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారు. లోకేష్ స్పీచ్ అంటేనే జోక్.. అన్నీ అబద్దాలే.. 

వైయ‌స్ జగన్ సీఎం అయ్యాక 6 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చారు.. అదే మీ నాన్న మూడుసార్లు సీఎంగా పనిచేసి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పే ధైర్యం ఉందా..? మా జగనన్న ఇచ్చిన ఉద్యోగాలు.. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో సచివాలయాల్లో కనిపిస్తున్నారు. మా హయాంలో.. లక్షా 35వేల సెక్రటేరియేట్ ఉద్యోగాలు, 53వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో 49వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది, 6,500 పోలీస్ రిక్రూట్ మెంట్, 3300 కోర్టు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే మొత్తం 6లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ప్రైవేటురంగంలో మరో 6లక్షల ఉద్యోగాలు పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా ఇవ్వడం జరిగింది.

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా అదానీ, అంబానీ లాంటి పెద్దపెద్ద దిగ్గజ పారిశ్రామికవేత్తలు సీఎం వైయ‌స్ జగన్ మీద నమ్మకంతో రూ. 13లక్షల కోట్లకు ఎంవోయూలు చేసుకున్నారు. మరో 6లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. టీడీపీ హ‌యాంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను నిట్టనిలువునా మోసం చేశారు. చంద్రబాబుకు గానీ.. లోకేష్ కు గానీ దమ్ము, ధైర్యం ఉంటే.. మీరు మోసం చేసిన నిరుద్యోగ యువత దగ్గరకు వెళ్లి సెల్ఫీలు దిగండి.

దళితుల ఆత్మ బంధువు సీఎం వైయ‌స్‌ జగన్ 
బీసీల బాంధవుడు, దళితులకు ఆత్మ బంధువు వన్ అండ్ ఓన్లీ జగనన్న.. రాష్ట్రంలో రూ.2లక్షల8వేల కోట్లను డీబీటీ పద్దతిలో పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావులేకుండా, లంచాలకు తావులేకుండా నేరుగా ప్రజలకు ఇచ్చిన నాయకుడు వైయ‌స్‌ జగన్.. ఆ డబ్బులో 80శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదలకే ఇచ్చారు. బీసీ, ఎస్సీ ద్రోహి చంద్ర‌బాబు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గత ఎన్నికల్లో బాబును ఇంట్లో కూర్చొబెట్టారు. చంద్రబాబు 40ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పులు చెబుతూ, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే.. 44 ఏళ్ల ఇండస్ట్రీలో చంద్రబాబు చూడని, చేయని అభివృద్దిని 45నెల్లలోనే వైయ‌స్‌ జగన్ చేసి చూపించారు. 

చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ.. వైయ‌స్ జగన్‌కి క్రెడిబులిటీ ఎక్కువ. చంద్రబాబుకు ఓటేస్తే మోసానికి ఓటేసినట్లేనని ప్రజలు నమ్ముతున్నారు. పరిశ్రమలు రావాలంటే వైయ‌స్ జగన్‌కి ఓటేయాలని ప్రజలు నమ్ముతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే వైయ‌స్ జగన్‌కే ఓటేయాలని ప్రజలు నమ్ముతున్నారు. ఆరునూరైనా.. 2024లో మళ్లీ వైయ‌స్ జగన్ సీఎం అవడం ఖాయం. 175కి 175 సీట్లు వస్తాయి. చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, రానున్న రోజుల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..

ఉత్తరాంధ్రకు బాబు చేసిన మేలు ఏమిటి?
ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు పిచ్చిపిచ్చి మాట‌లు మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి మాట్లాడే అర్హత అసలు మీకు ఉందా..? మీ నాయకుడు చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, మీ టీడీపీ ప్రభుత్వం మూడుసార్లు రాష్ట్రాన్ని పాలించినా.. ఉత్తరాంధ్రలో ఒక ఎయిర్ పోర్టు కట్టారా..? ఒక పోర్టు కట్టారా..? ఒక మెడికల్ కాలేజీ కట్టారా..? ఏ అర్హతతో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. 

రేపు సీఎం వైయ‌స్ జగన్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే డేటా సెంటర్ ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే, మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశారు. వీటన్నింటి వల్ల కొన్ని లక్షలమందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాబోతున్నాయి. మీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో కనీసం ఇటుక కూడా వేయని పరిస్థితి. జగనన్న ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీలువస్తున్నాయి. ట్రైబల్ యూనివర్సిటీ వస్తోంది. ప్రతి గ్రామంలో ఆర్బీకేలు, సెక్రటేరియేట్ లు, విలేజ్ క్లీనిక్ లు, ఇలా విప్లవాత్మకమైన మార్పుల ద్వారా అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఉత్తరాంధ్రకు రాజధానిని ఇచ్చి, విశాఖను పరిపాలన రాజధాని చేయడానికి కంకణం కట్టుకుని ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం, అభివృద్ది కోసం సీఎం వైయ‌స్‌ జగన్ నిరంతరం తపనపడుతున్నారు. 

 

Back to Top