క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

తాడేపల్లి: క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిని సీఎం వైయస్‌ జగన్‌ సహించరన్నారు.ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలన్నారు. హద్దు మీరితే చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారని ఉమ్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు..అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

Back to Top