పట్టాభి.. నోరు అదుపులో పెట్టుకో

టీడీపీ నేత తీరుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఆగ్ర‌హం

పెయిడ్‌ ఆర్టిస్టు పట్టాభీ.. బాబుపై ప్రేమ ఉంటే అతని బూట్లు నాకు

సీఎంగారు, ఆయన సతీమణిని విమర్శించే స్థాయి నీది కాదు

ఇలాంటి పెయిడ్‌ ఆర్టిస్టులతో చంద్రబాబు కుటిల రాజకీయాలు

420 రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

ఎమ్మెల్సీ పోతుల సునీత స్పష్టీకరణ

బాబూ నీ రాజకీయ జీవితం నీచం. వెన్నుపోటు చరిత్ర

సీఎంగారి పాలన చూసి ఓర్చుకోలేకే కుటుంబంపై విమర్శలు

నువ్వు, నీ కొడుకు ఏం ఉద్దరించారని తిరుగుతున్నారు?

ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్సీ సునీత

తాడేపల్లి:  టీడీపీ నేత పట్టాభి.. నోరు అదుపులో పెట్టుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత హెచ్చ‌రించారు. ప‌ట్టాభి తీరును ఆమె ఎండ‌గ‌ట్టారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పోతుల సునీత మీడియాతో మాట్లాడారు.

 పోతుల సునీత ఏం మాట్లాడారంటే:

ప్రేమ ఉంటే బూట్లు నాకు:
– వివేకానందరెడ్డిగారి హత్య జరిగినప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. మరి ఆయనేం చేశారు?
– అసలు భారతమ్మకు, రాజకీయాలకు సంబంధం ఏమిటి?
– పట్టాభి ఒక పెయిడ్‌ ఆర్టిస్ట్‌. చంద్రబాబు వద్ద డబ్బు తీసుకుని పని చేస్తున్నాడు.
– చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుంటున్న పట్టాభి, ఆయనపై ప్రేమ ఉంటే, బూట్లు నాకాలి. 
– అంతే కానీ, కనీసం వార్డు మెంబర్‌ కూడా కాని పట్టాభికి, సీఎంగారు, ఆయన సతీమణి గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు.
– ఇలాంటి పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో కుటిల రాజకీయాలు చేస్తున్నారు.
– జగన్‌గారి సుపరిపాలన చూసి ఓర్చుకోలేక రోజూ ఏదో ఒకదానిపై ఎవరో ఒకరితో మాట్లాడిస్తూ.. విమర్శలు చేయిస్తున్నారు.

420 రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌:
– చంద్రబాబు రాజకీయ నేపథ్యం అంతా కుట్రలు కుతంత్రాలే
– 420 రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు
– రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగిన సీఎంగారికి, ఆయన సతీమణికి  ఆపాదిస్తున్నారు
– బురద జల్లే రాజకీయాల్లో భాగంగానే ఈ పెయిడ్‌ ఆర్టిస్టులు, దుష్ట చతుష్టయం చేస్తున్న తంతు ఇది
– వీరి కుట్రలు, కుత్రంతాలను రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ గమనిస్తున్నారని గుర్తించాలి.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలంతా వెధవ పట్టాభి వంటి పెయిడ్‌ ఆర్టిస్టులకు చీపుర్లతో సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఏం ఉద్ధరించారని?:
– చంద్రబాబు రాజకీయ జీవితం నీచం. అంతా వెన్నుపోటు చరిత్ర.
– అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం, కులాలను అవమానించడం చంద్రబాబుకు అలవాటు.
– ఎస్సీలు, బీసీలు.. ఏ వర్గాన్నీ వదలకుండా అవమానించిన ద్రోహి చంద్రబాబు.
– అలాంటిది ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ప్రజల ముందుకు వెళ్తున్నారో అర్ధం కావడం లేదు.
– మీకు పచ్చ మీడియా అండగా ఉందని ఫోజులు కొడుతూ.. ప్రజల వద్దకు వెళ్తే వారు తగిన బుద్ధి చెబుతారు.
– లేని విషయాలను తీసుకొచ్చి మీ పచ్చ మీడియాలో పుంఖాను పుంఖాలు రాసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకోవద్దు. 
– అసలు చంద్రబాబు, ఆయన కొడుకు ఏం ఉద్ధరించారని రాష్ట్రంలో తిరుగుతున్నారు?
– ప్రజలు మా పార్టీకి మొత్తం 175 సీట్లు ఇస్తారని వెన్నులో వణుకు పుట్టిన చంద్రబాబు ఇలా నీచ రాజకీయాలు చేస్తున్నారు.
– చంద్రబాబు రాజకీయాలకు అసలు పనికిరాడు. అందుకే 2024లో కూడా ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ సునీత అన్నారు.

Back to Top