కుప్పం: గత 40 ఏళ్ళుగా పెత్తందారీ చంద్రబాబు చేయలేని పనులు మనసున్న మారాజుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసి చూపారని ఎమ్మెల్సీ కె.ఆర్.జె. భరత్ పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేఆరు. ఈ సందర్భంగా శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ ఏమన్నారంటే...ఆయన మాటల్లోనే .. అందరికీ నమస్కారం, ఈ రోజు కుప్పం చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు, దశాబ్ధాల కల నెరవేర్చిన సీఎంగారికి కుప్పం ప్రజల తరుపున ధన్యవాదాలు, 23.09.2022న కుప్పం బహిరంగ సభలో కుప్పంకు కృష్ణా జలాలు ఇస్తే కానీ నేను ఓటు అడగను అన్న గుండె జగనన్నది, అన్న మనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కుప్పం ప్రజలకు ఆప్యాయత కరువైంది, అలాంటి మాకు మీ ప్రేమానురాగాలు రుచిచూపించారు. గత 40 ఏళ్ళుగా పెత్తందారీ చంద్రబాబు చేయలేని పనులు మనసున్న మారాజుగా మీరు చేసి చూపారు, మీరు కుప్పాన్ని మునిసిపాలిటీగా మార్చడమే కాక దానికి రూ. 66 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ది పథంలో నడుపుతున్నారు, అంతేకాదు రెవెన్యూ డివిజన్ చేయడం, సబ్ డివిజన్ చేయడం, ఇలా ఎన్నెన్నో చేసి కుప్పం ప్రజల కళ్ళలో వెలుగులు నింపారు, ఈ మధ్య చంద్రబాబు తరచూ కుప్పం వస్తున్నారంటే మీ వల్ల వచ్చిన భయమే...మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం చూసిన ప్రజలు మీ గురించే మాట్లాడుతున్నారు, ఈ ప్రాంతం నుంచి రోజూ 10 వేల మంది రోజుకూలీ కోసం ట్రైన్స్‌లో బెంగళూరు, చెన్నై వెళుతుంటారు, ఈసారి 2024లో మీరు సీఎం అయిన తర్వాత మా కుప్పానికి ఒక ఎస్‌ఈజెడ్, ఇంజినీరింగ్ కాలేజ్, బెంగళూరుకు నేషనల్ హైవే తీసుకువచ్చి ఇక్కడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాను, అలాగే ఇక్కడ రెండు రిజర్వాయర్లు కట్టిస్తామని చెప్పారు, అవి కూడా పూర్తిచేయాలని కోరుకుంటున్నాను, స్ధానికంగా ఉన్న సమస్యలను మీరు పరిష్కరిస్తారని కోరుతున్నాను, మరో 50 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని, ప్యాకేజ్ స్టార్‌లను ఓడించడానికి నేను సిద్దం, మీరు సిద్దమా అని అడుగుతున్నా, కుప్పాన్ని, పులివెందులను రెండూ రెండు కళ్లుగా చూసుకుంటున్న సీఎంగారికి ధన్యవాదాలు, సెలవు.