వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కన్నుమూత

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి
 

విజయవాడ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం వైయ‌స్ జగన్‌ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం వైయ‌స్ జగన్‌, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.

సీఎం వైయ‌స్‌ జగన్‌ సంతాపం

 ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం వైయ‌స్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top