క్లౌడ్‌..జూమ్‌ అంటూ ఆకాశంలో విహరించడం కాదు..భూమిపైకి రండి బాబూ?

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ  షేక్ మహ్మద్ ఇక్బాల్  
 

అనంతపురం: ప్రతిపక్ష నేత చంద్రబాబు క్లౌడ్‌..జూమ్‌ అంటూ ఆశాశంలోని మేఘాల్లో విహరిస్తున్నారని, అవి మాని భూమిపైకి రావాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక దూరం అంటే సమాజానికి దూరం కావడం కాదని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు.  ప్రతిపక్ష నేత   కనీసం సామాజిక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  కరోనాతో కలిసి జీవించాల్సిన కాలం ఇది అని ముఖ్యమంత్రి జగన్ వాస్తవం చెబితే ఇందులో మీకేందుకు తప్పుగా కనిపిస్తుందని ప్రశ్నించారు.  కరోనా కట్టడిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని , ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించాల్సింది పోయి ... ప్రజల్లో లేనిపోని అపోహలు ,భయాలు ,ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం మీకు తగునా ? అని నిలదీశారు.  కరోనా విపత్కర సమయంలో కోవిడ్ వారియర్స్ గా పనిచేస్తోన్న వాలంటీర్లను ఇదే చంద్రబాబు నాయుడు హేలన చేస్తూ మాట్లాడారని ధ్వజమెత్తారు. మనం ఎప్పుడైతే సోషల్ రెస్పాన్స్‌బులిటీ మరిచిపోతామో.. అప్పుడే సోషల్ క్రైసిస్ పుట్టుకొస్తాయన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మాట్లాడకుండా బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబుకు ఇక్బాల్‌ సూచించారు. 

Back to Top