"బాబు నోటు రాజకీయం"పై విచారణ జరగాలి

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ 

 నాటి వైశ్రాయ్‌ నుంచి నిన్నటి ఎమ్మల్యేల కొనుగోలు  వరకూ బాబుది అదే తీరు

 సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

  ఈడీలాంటి సంస్థలు ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసిందో వెలికితీయాలి

 మొన్న తెలంగాణ, నేడు ఏపీలో ఓటుకు నోటు వ్యవహారాలకు మూలం చంద్రబాబే

 శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్

 శ్రీదేవి స్క్రిప్ట్‌ బాబుదే..
 
 మీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకే సజ్జల గారిపై ఆరోపణలు

 ఇక్కడ నీ గురించి ఎవరూ ఆలోచించడం లేదు...భయపడాల్సిన పనిలేదు

 పెద్దవాడిగా చెప్తున్నా...కులాన్ని వాడుకోవద్దు

 వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌

 నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు

 వైయ‌స్ జ‌గ‌న్‌ గారి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు

  డొక్కా మాణిక్యవరప్రసాద్

తాడేప‌ల్లి:   చంద్ర‌ బాబు నోటు రాజకీయంపై విచారణ జరగాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  

- నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావించారు
- తనకు డబ్బులివ్వడానికి ఒక ఎమ్మెల్యే ద్వారా చంద్రబాబు మనుషులు కొందరు సంభాషించారని చెప్పాడు
- ఆ ఆఫర్‌ను తాను రిజెక్ట్‌ చేశానని కూడా రాపాక వరప్రసాద్‌ చెప్పారు..
- నేను మాట్లాడిన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకున్నారు
- ఇంతటి దుర్మార్గానికి పాల్పడినందుకు ఆ వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది
- గతంలో తెలంగాణా రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు
- మళ్లీ మన రాష్ట్రంలో అటువంటి ప్రయత్నాలే చేయడం దుర్మార్గమైన విషయం
- ఈ వ్యవహారంపై.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి
- ఒక్కొక్క  ఎమెల్యేకి రూ.10 నుంచి 20 కోట్లు ఇస్తామన్నారని రాపాక, మద్దాళి గిరి కూడా తెలిపారు
- వీటన్నిటిపై వెంటనే సీబీసీఐడీ విచారణ జరపాలి...దీనికి సంబంధించిన వారిని అరెస్ట్‌ చేయాలి
- ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నా
- తెలంగాణాలో జరిగిన ఓటుకు నోటు కేసును కూడా దీనితో కలిపి విచారించాలి
- ఈడీ లాంటి సంస్థలు ఇంత డబ్బు ప్రయాణం చేసిన ఈ సందర్భాన్ని, ఎలా డబ్బు తరలింది అనేది విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి
- తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభం అయ్యింది.

వైశ్రాయ్‌ నుంచి నిన్నటి వరకూ మారని బాబు తీరు:
- ఇలాంటి అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
-1995లో వైశ్రాయ్‌ క్యాంపు దగ్గర నుంచి నిన్నటి ఓటుకు నోటు  వరకూ గమనించండి
- ఇప్పుడు వరప్రసాద్, గిరితో మాట్లాడటం చూడండి..ఇవన్నీ ఒకే సోర్స్‌ నుంచి జరుగుతున్నాయి
- ఆ సోర్స్‌ను పట్టుకుని ఆపగలిగితే ప్రజాస్వామ్యానికి మంచింది..భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి
- విచారణ సంస్థలకు ఎక్కడ పట్టుకుంటే ఇది ఆగిపోతుందో నేను క్లూ ఇస్తున్నా..

అమరావతి అన్నావంటే స్క్రిప్ట్‌ ఎక్కడిదో అర్ధం కావడం లేదా..?:
- ఉండవల్లి శ్రీదేవి గారు తన మార్గంలో  ప్రయాణం చేస్తున్నారు...వెళ్లిపోయారు
- ఆమె ఒక్కదాన్నే కాదు నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు
- పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఇతర పార్టీలతో కలిసిపోయారనేది పార్టీ నమ్మింది
- దానిపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేశారు
- ఎందుకు ఆమె కంగారుపడి అమరావతి నినాదాన్ని ఎత్తుకున్నారు..?
- నువ్వు తెలుగుదేశం వారితో వెళ్లావని చెప్పడానికి ఇంతకంటే ఆధారం అవసరం లేదు
- నిన్న నువ్వు మాట్లాడిన స్క్రిప్ట్‌ అంతా యథాతథంగా టీడీపీదే.
- నువ్వు తెలుగుదేశానికి సహకరించుకోవాలి అనుకుంటే సహకరించుకో
- నీ  బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు, నీ  వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలని సజ్జల గారితో నాకుప్రాణ హాని అనడం సరైంది కాదు
- అంత పెద్ద వారి గురించి ఎందుకు..? నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారని అంతటి పెద్ద పెద్ద మాటలు..?

పెద్దవాడిగా చెప్తున్నా...కులాన్ని వాడుకోవద్దు:
- మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు...మీ మార్గం మీరు ఎంచుకున్నారు..దయచేసి మీ పని మీరు చేసుకోండి
- ఒక పెద్దగా, సీనియర్‌గా, మీ నాన్నకు స్నేహితుడిగా చెప్తున్నా...ఒక కుల పెద్దగా కూడా చెప్తున్నా
- ఇలాంటి విషయాల్లో కులాన్ని వాడుకోవద్దు...మీ నాన్న ప్రతిష్టను పాడుచేయవద్దు
- పెద్ద పెద్ద పేర్లు వాడటం వల్ల నీకు ఏమీ మంచి పేరు రాదు
- వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌
- ఎన్నిసార్లు చెప్పినా నీ ప్రవర్తనలో మార్పు రాలేదు
- నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు
- పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పడం వల్ల పేపర్లో ఒక రోజు పేరు వస్తుందేమీ కానీ నీకు ఒరిగేది ఏమీ లేదు
- ఇలాంటి చర్యల వల్ల సమాజం హర్షించదు..వాస్తవం ఏం జరిగిందో ప్రజలకు తెలుసు
- నీకు బంధువుగా, కులపెద్దగా చెప్తున్నా...కులాన్ని తీసుకురావద్దు...పెద్ద వాళ్ల పేర్లు వాడొద్దు

ప్రభుత్వం నీకు కావాల్సిన రక్షణ కల్పిస్తుంది:
- నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు చూసుకో..నీకు ఎలాంటి భయం లేదు
- ప్రభుత్వం నీకు ఏం రక్షణ కావాలో అది కల్పిస్తారు..ఎక్కడైనా నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు
- ఎవరిమీదా వైల్డ్‌ ఎలిగేషన్స్‌ చేయవద్దు...చేసి మీనాన్న ప్రతిష్టకు, కుల ప్రతిష్టకు భగం కలిగించవద్దు
- సజ్జల గారు చంపాలని చూస్తున్నాడంటూ అంత పెద్ద మాటలు మాట్లాడతావా అమ్మా..?
- నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా...అలాంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయవద్దు
- కొన్ని మీడియా వాళ్లు, రాజకీయ పార్టీలు నిన్ను రెచ్చగొడతారు...
- రాజకీయంగా నీ ప్రయాణం నువ్వు చేసుకో...దానికి మేమేం అడ్డు చెప్పడం లేదు
- కానీ కులాన్ని వాడుకోవద్దని మాత్రం ఒక పెద్దవాడిగా చెప్తున్నా

జగన్‌ గారి నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారు:
- జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు
- ఎమ్మెల్యే శ్రీదేవి గారిని కూడా ఆయన చాలా గౌరవంగా చూసుకున్నారు
- ఇక ఇలాంటి వివాదాలు క్లోజ్‌ చేసి రాజకీయంగా నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్లు
- అనవరంగా వివాదాస్పద విషయాలు మాట్లాడి వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు
- కులాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని నా మనవి

Back to Top