ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూడటం బాధ క‌లిగించింది

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన డొక్కా

అమరావతి: శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూడటం బాధ కలిగించింద‌ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ పేర్కొన్నారు.  తాను రాజీనామా చేయడానికి ఇది ఒక కారణమని చెప్పారు. మండలి అంటే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేలా ఉండాలన్నారు.  మండలి చైర్మన్‌కు కొందరు తప్పుడు గైడెన్స్ ఇచ్చారని డొక్కా ఆరోపించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ మంగళవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీగా త‌న‌ను ఎన్నుకున్నందుకు ​ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  చట్టసభలు అత్యధిక ప్రమాణాలతో ఉండాలని భావిస్తానన్నారు.  ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా తాను సభకు ఆబ్సెంట్ అవ్వలేదని తెలిపారు. అలాంటిది మండలిలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న సభ నిర్ణయాలు గౌరవించాలని సూచించారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు
రాజీనామా చేస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అని చెప్పిన మాటకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధిఅంబ‌టి రాంబాబు అన్నారు. తమ పార్టీ నైతిక విలువలకు ఇదే నిదర్శనం అని స్పష్టం చేశారు.  డొక్కా మాణిక్య వరప్రసాద్‌  ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారన్నారు. అంతకు ముందు ఆయన తెలుగుదేశం నుంచి గెలిచి తర్వాత వైయ‌స్ఆర్ సీపీలో చేరారని తెలిపారు. అయితే  వైయ‌స్ఆర్‌ సీపీలో చేరే ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారన్నారు. ఆ  తర్వాత ఆయన స్థానానికి  వైయ‌స్ఆర్ సీపీ  మళ్లీ ఆయన్నే నిలబెట్టిందన్నారు. టీడీపీ పదవులు వదిలేసి వైయ‌స్ఆర్‌సీపీ టికెట్‌పై గెలిచిన మొదటి వ్యక్తి డొక్కా అని ప్రశంసించారు. 
 

Back to Top