పార్టీ నుంచి ఎమ్మెల్సీ అనంత‌బాబు స‌స్పెండ్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు ఎమ్మెల్సీ అనంత‌బాబును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. త‌న మాజీ డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంత‌బాబు త‌మ‌కు వాంగ్మూలం ఇచ్చిన‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అనంత‌బాబును పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  

Back to Top