చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాదయాత్ర

-పాదయాత్రలో విశ్వేశ్వరరెడ్డి సోదరుడు శ్రీనాత్ రెడ్డి

ఉరవకొండ: నాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిపోతుందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వైస్ ఎంపీపీ శ్రీనాత్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో వైస్సార్సీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక పార్క్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.అనంతరం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..నాడు ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారన్నారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని, రెండు పేజీలు మ్యానిఫెస్టోలో పెట్టి నవరత్నాలుగా మార్చి ప్రజలకు అందించారని తెలిపారు. కోట్లాది మంది ప్రజల కష్టాలు తెలుసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, ఎంపీపీ చంద్రమ్మ, జెడ్పిటిసీ పార్వతమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ,కురుబ, సంచార కార్పొరేషన్ల డైరెక్టర్లు గోవిందు, వెంకటేష్, నాయకులు తేజోనాథ్, బసవరాజు,ఏసీ ఎర్రిస్వామి, ఓబన్న, బ్యాంక్ ఓబులేసు, అంగదాల అంజి, జోగి భీమా,సాధు కుల్లాయి స్వామి,మిడతలు చంద్రమౌళి, నిమ్మల రమణ, ఎంపిటిసి లు, వార్డు సబ్యులకు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top