కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగుర‌వేస్తాం

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ 
 

విజ‌య‌వాడ‌:  ఇబ్ర‌హీంప‌ట్నం-కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఎగుర‌వేస్తామ‌ని ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ధీమా వ్య‌క్తం చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటా ప‌ర్య‌టించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ ఓట్లు అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుంద‌న్నారు.  ప్రజలను ఓట్లు అడగడానికి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయ‌న్నారు. గ‌త‌ పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి కేవలం 20 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరిగింద‌న్నారు. తాను  ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి 40 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దాంట్లో 31 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింద‌న్నారు. 32 కిలోమీటర్లు డ్రైనేజీలు నిర్మించి,  నాలుగు కోట్ల రూపాయల పైగా వెచ్చించి రోడ్లు నిర్మించామ‌న్నారు. 14 అంగన్వాడీ కేంద్రాలు 3,600 మందికి ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేశామ‌న్నారు. 

తాజా ఫోటోలు

Back to Top