మా కుల పత్రికలకు టీడీపీలో ఉన్న వారే కమ్మ వాళ్లా?

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌

క్వారీ పర్మిషన్లు ఉన్న భూములను ఫారెస్టు భూములంటున్నారు

ఆ భూములకు అనుమతి ఇచ్చింది టî డీపీ ప్రభుత్వమే

మంత్రి హోదాలో దేవినేని ఉమా క్రషర్లు ప్రారంభించారు 

క్వారీ భూములపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే

లోకేష్‌ కూడా తనను విమర్శించడం సిగ్గు చేటు

తాడేపల్లి: మా కుల పత్రికలకు టీడీపీలో ఉన్న కమ్మ వాళ్లే కమ్మవాళ్లుగా కనిపిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ విమర్శించారు. ఓ పథకం ప్రకారం ఎల్లోమీడియా వేరే పార్టీలోని కమ్మ నాయకుల ప్రాధాన్యతను తగ్గిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై టీడీపీ నేత దేవినేని ఉమా అసత్యాలు ప్రసారం చేయించి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. క్వారీ పర్మిషన్లు ఉన్న భూములను ఫారెస్టు భూములంటున్నారని, టీడీపీ ప్రభుత్వమే ఆ భూములకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కేఈ కృష్ణమూర్తి క్వారీ అనుమతులు ఇచ్చారని తెలిపారు. మంత్రి హోదాలో దేవినేని ఉమా స్వయంగా క్రషర్లను ప్రారంభించారని గుర్తు చేశారు.ఎల్లోమీడియా అండతో అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. రైతుల గొడవలకు నాకు ముడిపెట్టే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వసంత కృష్ణ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు.

క్వారీ అనుమతులు ఉన్న భూములను ఫారెస్టు భూములంటూ టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. 5.10.2018న కేఈ కృష్ణమూర్తి స్టే ఆర్డర్‌ ఇచ్చారు. ఇవి రెవెన్యూ భూమిలు,  వీటికి  సర్వే నంబర్లు కేటాయించాలని జేసీ– 1 విజయకృష్ణన్‌ మొదటి రిపోర్ట్‌ ఇచ్చారు. ఇవి రెవెన్యూ భూములు కావని దేవినేని ఉమా రద్దు చేయించారు. ఆ తరువాత కేఈ కృష్ణమూర్తితో ఉమానే స్టే ఇప్పించారు. వీళ్లంతా గనులు నడుపుకుంటున్నారు. అదే సర్వే నంబర్‌ 143లో చెన్నుబోయిన రాధా, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడికి అధికారికంగా అనుమతి ఉంది. ఇదే సర్వేనంబర్‌లో 2016, డిసెంబర్‌ 4న దేవినేని ఉమా ఆ క్రషర్‌ను ప్రారంభించారు. సమాచార హక్కు చట్టం కింద అదే సర్వేనంబర్‌లో ఇచ్చిన లీజు వివరాలు..105 ఎకరాలు డాక్టర్‌ సుదర్శన్‌రావుకు  ఇచ్చారు.  దేవినేని ఉమా ఈ భూముల్లోకి వెళ్లి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిన భూములను ఈ రోజు ఫారెస్టు భూములు అంటున్నారు. కొండపల్లె రిజర్వ్‌ ఫారెస్ట్‌ సరిహద్దు, బోయ విలేజీ, సర్వే నంబర్‌ 143లో దేవినేని ఉమా తాను అక్రమంగా క్వారీ చేయించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. అక్కడి నుంచి కిలోమీటర్‌ దూరంలో రిజర్వ్‌ ఫారెస్టు ఉంది.

 దేవినేని ఉమా, టీడీపీ నేతలకు సిగ్గుశరం ఉంటే..మీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ భూముల్లో మీరు వెళ్లి క్రస్సర్‌ను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. జేసీ కాదన్న వాటికి మీరే అనుమతి ఇచ్చి..ఉమ్మడి కమిటీ కూడా రెవెన్యూ భూములు అని నిర్ధారించింది. మేం 20 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో ఉమాకు దురుద్దేశం మొదలైంది. మా కుల మీడియాను అడ్డం పెట్టుకొని అసత్య కథనాలు రాయిస్తున్నారు. ఇలా 15 సార్లు అదే ప్రాంతానికి ఉమా వెళ్లి ఆరోపణలు చేస్తున్నారు.

అసలు అవి రెవెన్యూ భూములా? ఫారెస్టు భూములా?. ఉమా ఎలా క్రషర్‌ ప్రారంభించారు. ఎందుకు అనుమతులు ఇప్పించారు. డాక్టర్‌ సుదర్శన్‌రావు ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీలు ఉన్నాయి. లీజు పునరుద్ధరించలేదు. 20 ఏళ్ల క్రితం జరిగిన మైనింగ్‌ అంతా కృష్ణప్రసాద్‌ చేశారని ఆరోపిస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు పత్రికలను అడ్డుపెట్టుకొని ప్రతి రోజు వెకిలి చెష్టాలు చేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక కృష్ణ ప్రసాద్‌పై బురద జల్లేందుకు కుట్రలు చేస్తున్నారు. 

నీతిభాహ్యమైన వ్యాఖ్యలు నమ్మి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తాను కొండపల్లి వీరప్పన్‌ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను అక్రమాలు చేస్తుంటే చంద్రబాబు చూశారట. నీ కేబినెట్లో పని చేసిన వ్యక్తి అవాస్తవాలు చెబుతుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు వంత పాడుతున్నారు. ఈ భూములు రెవెన్యూనా? ఫారెస్టువా? తేల్చండి. తాను ఏ విచారణకైనా సిద్ధమే. 

మొన్న తనపైనే దాడి జరిగినట్లు దేవినేని ఉమా డ్రామాలాడారు.  15 సార్లు క్వారీ భూముల వద్దకు దేవినేని ఉమా వెళ్లాడు. ఫేక్‌బుక్‌లో ఫొటోలు పెట్టారు. రైతుల మధ్య పోట్లాటను తనపై ఆరోపణలు చేశారు. కాల్వలు మాయమయ్యాయని ఓ పత్రిక రాస్తే..దానిపై ఆరోపణలు చేశారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వాస్తవాలు వెలికితీయండి. అబద్ధాలను నిజం చేయాలనుకుంటే ప్రజలు ఎదురు తిరుగుతారు. ప్రజలకు సమాధానం చెప్పలేక పోలీస్‌ స్టేషన్‌ వద్ద డ్రామాలాడారు. అసలు మా నాయకుడి కారు ధ్వంసం చేసి..మాపైనే ఆరోపణలు చేశారు. 

మా కుల పత్రికలకు టీడీపీలో ఉన్న కమ్మ వాళ్లే కమ్మవాళ్లు..ఓ పథకం ప్రకారం ఎల్లోమీడియా ఉద్దేశపూర్వకంగా వేరే పార్టీలోని కమ్మ నాయకుల ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. సోడాలు కొట్టుకునే ఉమాను హైలెట్‌ చేస్తున్నారు. ఎన్టీ రామారావు కాళ్లు పట్టుకొని టికెట్లు తెచ్చుకున్న వారే ..ఆయనపై చెప్పులు వేయించారు. 2018లో వైయస్‌ఆర్‌సీపీలో చేరాను. నాపై రోజుకో కట్టుకథతో తప్పుడు ప్రచారం చేశారు. ఎన్ని కట్టు కథలు చెప్పినా..ఎల్లోమీడియాను నమ్మి కమ్మ కులస్తులు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. 

చంద్రబాబు సీఎం అవుతారని లగడపాటి రాజగోపాల్, టీడీపీ నేతలు సంయుక్తంగా సర్వేలు చేసి కోట్లు కొల్లగొట్టారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా..మేం భయపడం. మా నాన్నపై లేని ఈవోపై దాడి చేసినట్లు దుష్ప్రచారం చేశారు. పోలీసు స్టేషన్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే లంచాలు ఇవ్వజూపానని అవాస్తవాలు ప్రచారం చేశారు. ఏడాది పాటు వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌గా పని చేస్తే 12 కేసులు పెట్టించారు. ఈ రోజు ఉమా పోలీసు స్టేషన్‌లో కూర్చొని ఫోన్లు చేస్తూ మీడియాతో మాట్లాడారు. తన అనుచరులను రెచ్చగొట్టారు. పోలీసుల సహనాన్ని పరీక్షించారు. మాపై దాడులు చేసి కట్టు కథలు అల్లారు. 

ఇలాంటి నీతిభాహ్యమైన నాయకులను పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేయడం వల్లే ఈ జిల్లాలో ఒక్క సీటు మిగిలింది. ఇలాంటి నాయకులను వెనుక పెట్టుకుంటే చంద్రబాబు పార్టీ జిల్లాలో తుడిచిపెట్టుకుపోతుంది. 
విశ్వస్సేనుడి పుత్రరత్నం..తస్కస్మం బోట్లు అని లోకేష్‌ చెబితే ఆయన రాష్ట్రానికి ఏదో ఒక రోజు సీఎం అయినట్లే అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గం పేరు పలకడం చేతకాని లోకేష్‌ లాంటి దద్దమ్మ కూడా నాపై ట్వీట్లు చేయడం ఏంటి?. ఉమా నోటికి వచ్చినట్లు వాగితే..నీచమైన ప్రతి పనిని మీరు సమర్థిస్తారా? మీరంతా ఓ దొంగల ముఠా.     

రెవెన్యూ భూములు కావు..ఫారెస్టు భూములు అని నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమని సవాలు విసిరారు. మా సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తే..మాలాంటి చిత్తశుద్ధితో పని చేసే ఎమ్మెల్యేలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా ఎన్నికకు ముందు నన్ను ఓడించేందుకు ఓ రైతు ధాన్యం బకాయి డబ్బులు పడలేదని శునకానందం పొందారు. ఎన్నికల ఫలితాల రోజు కూడా ఏబీఎన్‌ చానల్‌లో తాను వెనుకంజలో ఉన్నానని తప్పుడు వార్తలు చెబితే..ఆ వార్తలు నమ్మి నా నియోజకవర్గంలో ఓ వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారని చెప్పారు. ఇలాంటి నీతిమాలిన కథనాలు మానుకోవాలని ఎల్లోమీడియాకు వసంత కృష్ణప్రసాద్‌ హితవు పలికారు. 

 

Back to Top