ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని దేవినేని ఉమా చిల్ల‌ర రాజ‌కీయాలు

మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్  

మైల‌వ‌రం:  టీడీపీ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని  త‌న కారుపై దాడి జ‌రిగింద‌ని చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్  మండిప‌డ్డారు.  దేవినేని ఉమానే వైయస్ఆర్సీపీ స్థానిక నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ కారుపై దాడి చేయించి, ఉమా కారుపై దాడి జరిగిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సహా మిగతా ఎల్లో మీడియాలో అదే కారును చూపించి ప్రచారం చేయడం దుర్మార్గ‌మ‌న్నారు.   తనకు వత్తాసు పలికే మీడియాను అడ్డు పెట్టుకుని తనపై దాడి జరిగిందని పనిగట్టుకుని ఉమా తప్పుడు ప్రచారం చేస్తున్నాడ‌ని వ‌సంత కృష్ణ ప్రసాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం ఉమాకు అల‌వాటే..
 రోజూ తప్పుడు ప్రచారాలు చేయడం దేవినేని ఉమాకు అలవాటేన‌ని కృష్ణ ప్ర‌సాద్ విమ‌ర్శించారు . జి.కొండూరు పోలీస్ స్టేషన్  దగ్గర దేవినేని ఉమ తన కార్యకర్తలను రెచ్చిగొట్టి, వైయస్ఆర్సీపీ నాయకుడు దుర్గా ప్రసాద్ కారుపై దాడి చేయించి, కారును ధ్వంసం చేశారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న దళిత యువకుడు సురేష్ పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచార‌ని తెలిపారు.  పోలీస్ స్టేషన్ సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా వైయస్ఆర్సీపీ నాయకుడు దుర్గా ప్రసాద్ కారుపై దేవినేని ఉమ అనుచరులు దాడి చేసిన వీడియో ఫుటేజి రికార్డు అయింద‌ని చెప్పారు.

ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి..
దేవినేని ఉమా, ఎల్లో బ్యాచ్ వాస్తవాలను ఏ విధంగా వక్రీకరిస్తున్నారో అనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి.  దేవినేని ఉమా ఈ నిమిషానికి కూడా పోలీస్ స్టేషన్ ముందు డ్రామాలు ఆడుతున్నాడు. 
దేవినేని ఉమాపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాల‌ని ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర సాద్ కోరారు.

ఉమా సానుభూతి డ్రామాలు..
 గ్రామంలో పరామర్శకు వెళ్ళిన వైయస్ఆర్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి, దేవినేని ఉమానే దాడి చేయిస్తే.. వారు జి.కొండూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయటానికి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా దేవినేని ఉమ అనుచరులు మరింతగా రెచ్చిపోయారు. తప్పు వాళ్ళు చేసి,  దేవినేని ఉమా సానుభూతి డ్రామాలు ఆడుతున్నాడ‌ని మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top