మనస్సాక్షి లేని వ్యక్తి చంద్రబాబు

ఎమ్మెల్యే వరప్రసాద్‌
 

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనస్సాక్షి లేదని ఎమ్మెల్యే వరప్రసాద్‌ విమర్శించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రూపొందించిన బిల్లుపై ఆయన మాట్లాడారు. స్థానికులకు 75 శాతం పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. వైయస్‌ జగన్‌ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెనాల్టీ విధించేలా చట్టంలో చేర్చాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన ప్రాంతాలకు సబ్సిడీలు అందించాలని వరప్రసాద్‌ డిమాండు చేశారు.
 

Back to Top