టీడీపీ నేత వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలి 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్  
 

అనంత‌పురం: విజయవాడలో 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆ బాలిక ఆత్మహత్యకు కారకుడైన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ కోరారు. బాలిక ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఉషాశ్రీ చ‌ర‌ణ్ మాట్లాడుతూ..  విజయవాడలో టీడీపీ ‌నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేదింపులకు బలైన 14 ఏళ్ల చిన్నారి ఘటన చాలా బాధాకరమ‌న్నారు.   కనీసం చిన్నారి బాలికపై దయ లేకుండా అసత్య ప్రచారాలు చేస్తూ నేడు టీడీపీ మనుగడ కోసం ఇలా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తూ నారీ యాత్ర దీక్షతో దొంగ దీక్షలు చేయడం ఎంత వరకు సమంజసం అని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.  రాష్ట్రంలో మహిళా భద్రత కోసం సీఎం వైయ‌స్ జ‌గ‌న్  పెద్దపీట వేసారు.మహిళా రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకు రావడంతో పాటు,దిశ పోలీస్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు పూర్తీ రక్షణ కల్పిస్తున్నారు.ముఖ్యంగా విధ్యార్ధినులు,మహిళలకు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు దిశ యాప్ ద్వారా గాని లేదా గ్రామ,వార్డు సచివాలయాల్లో వుండే మహిళా పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top