ల్యాండ్ టైట్లింగ్ బిల్లుతో అన్న‌ద‌మ్ముళ్ల మ‌ద్య త‌గాదాలు త‌గ్గుతాయి

ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను
 

అమ‌రావ‌తి:  ల్యాండ్ టైట్లింగ్ బిల్లుతో రాష్ట్రంలో అన్న‌ద‌మ్ముళ్ల మ‌ధ్య ఉన్న త‌గాదాలు త‌గ్గుతాయ‌ని ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను పేర్కొన్నారు. గురువారం రెవెన్యూ భూ హ‌క్కుల స‌మ‌గ్ర స‌ర్వే బిల్లుపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడారు. ఈ చ‌ట్టం పూర్తిగా స‌మంజ‌స‌మైన‌ది. గ‌త‌లో ఏన్నో ఏళ్లుగా భూ వివాదాల‌తో ఎంతో మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. స‌ర్వే రాళ్లు కూడా స‌రిగా లేవు. శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో ప్ర‌భుత్వం స‌ర్వే చేసేందుకు ముందుకు రావ‌డం శుభ‌ప‌రిణామం. స‌మ‌గ్ర ప‌ద్ధ‌తిలో స‌ర్వే చేస్తేచేస్తే ఏ ప‌ట్టాకు  ఏ భూమి ఉంటుందో పోల్చ‌డం సుల‌భ‌మ‌వుతుంది. అనేక కుటుంబాల మ‌ధ్య అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అస్తి త‌గాలు త‌గ్గుతాయి. గ‌తంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హ‌యాంలో ఈ విధానం ఫెయిల్ అయ్యింద‌ని, ఇప్పుడు స‌మ‌గ్ర విధానంతో ప్ర‌భుత్వం చ‌ట్టం రూపొందించింది. ఈ నెల 21న త‌క్కెళ్ల‌పాడు గ్రామంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌గ్ర స‌ర్వే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నార‌ని ‌చెప్పారు. ఇంటి కొల‌త‌లు కూడా స‌రిగ్గా నిర్ధారించి, త‌ప్పు ఉంటే స‌వ‌ర‌ణ చేస్తారు. ఇది మంచి ప‌రిణామం అంద‌రూ కూడా స‌హ‌క‌రించాల‌ని ఉద‌య‌భాను కోరారు. 

Back to Top