రైతుకు అత్యున్నత స్థానం కల్పించారు

కౌలు రైతుకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండ

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

 

అమరావతి: సమాజంలో రైతుకు అత్యధిక స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరిట 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కౌలు రైతుల కష్టాలు దగ్గరుండి చూసి చలించారన్నారు. కౌలు రైతులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన ప్రయత్నం చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కౌలు దారులకు రక్షణగా చట్టం తీసుకువచ్చరన్నారు. మట్టినే నమ్ముకున్న సాగుదారులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వారిని ఆదుకునే విధంగా చట్టాన్ని రూపొందించారన్నారు. ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి సాగుదారులకు సాయం చేయడం, పంట పెట్టుబడి సాయం అందించడం, పంటపై రుణాలు అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చారన్నారు. వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేయించే పథకాన్ని తీసకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు.

Back to Top