అనంతపురం: సీఎం వైయస్ జగన్ అంటే నిజం.. ఆయన ఏది చెప్పినా నిజమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అంటే అపద్ధం. చంద్రబాబు అంటే మోసం, చంద్రబాబు అంటే కుట్ర, చంద్రబాబు అంటే దగా, చంద్రబాబు వెన్నుపోటు అని విమర్శించారు. పథకాల పేరుతో ప్రజలను వంచనకు గురి చేసిన చంద్రబాబును నమ్ముతారా...అదే పథకాల పేరుతో పేదల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ చేసిన జగనన్నను నమ్ముతారా...ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి’’ అని రాప్తాడు ఎంఎల్‌ఎ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రామగిరి మండలం ఎంసీపల్లి, పేరూరు, రామగిరి, కనగానపల్లి మండలం ముత్తవకుంట గ్రామాల్లో ‘వైయస్‌ఆర్ ఆసరా’ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...21 ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏరోజూ పేద విద్యార్థుల చదువులకు తల్లులకు ‘అమ్మఒడి’ డబ్బులు ఇద్దామని ఆలోచించలేదు. 45 ఏళ్లు దాటిన మహిళలకు తోడుగా ఉండేందుకు ‘చేయూత’ సాయం చేయలేదు. మరి జగనన్న చేసి చూపించాడు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు 52 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా రైతు రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, ఇంటింటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ యువతకు నెలకు 2 వేల రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం. ఆరుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది అని చంద్రబాబు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత స్వయంగా అసెంబ్లీలో 2018లో మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మాపీ చేయలేదుని, మాఫీ చేయాలనే అంశం పరిశీలన కూడా ప్రభుత్వం చేయలేదని చెప్పింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు 11,600 కోట్లు ఉండేవి. ఆయన 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి ఈ అప్పులు 25,500 కోట్లుకు చేరుకున్నాయి. అంటే ఆయన అధికారం నుంచి దిగిపోయే నాటికి రెండింతలకు పైగా డాక్రా అప్పులు పెరిగాయి. నేను ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న అప్పులన్నీ నాలుగు విడతల్లో నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తానని జగనన్న చెప్పాడు. చెప్పిన మాట ప్రకారమే ‘వైయస్‌ఆర్ ఆసరా’ ద్వారా నాలుగు విడతల్లో మొత్తం రుణాలు మాఫీ చేసి మాటనిలబెట్టుకున్నాడు. మీరందరూ సంతోషంగా ఉండాలి. మీ కళ్లల్లో ఆనందం చూడాలన్న జగనన్న ఆశ. కులాలు, మతాలు, పార్టీలు చూడడం లేదు. కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో ఫించన్ల కోసం ప్రతినెలా 400 కోట్లు పంచితే, ఈరోజు జగనన్న 2 వేల కోట్లను పంచుతున్నారు. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా పిల్లల చదువులకు 50 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 30 వేల కోట్ల రూపాయలు జమ చేశారు. 45 ఏళ్లు దాటిన అక్కచెల్లెమ్మలు ‘చేయూత’ పథకం ద్వారా 31 లక్షల మందికి 14 వేల కోట్ల రూపాయలు జమ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద 11 వేల కోట్ల రూపాయలు చెల్లించారు. 66 లక్షల మంది వద్ధులు, వికలాంగులు, వితంతువులకు 3 వేల రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. జగనన్న వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు 2.53 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇన్నిసార్లు బటన్ నొక్కి మన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసి మన జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న కోసం ఒక్కసారి మీరు బటన్ నొక్కలేరా?. మీ నొక్కుడు తెలుగుదేశం పార్టీకి పీక నొక్కుడు కావాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పచ్చపార్టీ నేతలు వచ్చి చెప్పే కథలను నమ్మొద్దండి. చంద్రబాబు వస్తే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ గ్యాస్ మాటలు చెబుతున్నారు. అందరూ గమనించాలని కోరారు. రాప్తాడు నియోజవకర్గంలో 50 వేల పింఛన్లు ఇస్తున్నాం. 17 వేల ఇళ్లను తీసుకొచ్చాం. మరో 11 వేల ఇళ్లను మంజూరు చేసుకోబుతున్నాం. 2 వేల బోర్లు ఉచితంగా వేశాం. మరో వెయ్యి బోర్లు వేయబోతున్నాం. 25 ఏళ్లుగా తాగునీటి కోసం అల్లాడుతున్న నియోజకవర్గ ప్రజల కోసం రెండు ప్రధాన స్కీములు తీసుకొచ్చాం. సంక్షేమ బు పథకాల ద్వారా నియోజెకవర్గానికి 3 వేల కోట్లు ఖర్చు చేసిన జగనన్నను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. సీఎంఆర్ఎఫ్ కింద 5 లక్షలు ఆర్థిక సాయం రామగిరి మండలం పేరూరు గ్రామానికి చెందిన బొమ్మయ్య గారి శ్రీనివాసులు అనారోగ్యానికి గురయ్యాడు ఈయనకు సీఎంఆర్ఎఫ్ కింద 5 లక్షలు మంజూరు అయింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్ ను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు..