వైయ‌స్ జ‌గ‌న్‌ను మళ్ళీ సీఎం చేసుకునేవరకూ విశ్రమించం

ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు
 

ప్ర‌కాశం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకునేవరకూ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు విశ్రమించవని సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అన్నారు. చీమకుర్తిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మాట్లాడారు. 
 ఈ రోజు ఇద్దరు నాయకుల విగ్రహాల ఆవిష్కరణకు సీఎంగారు రావడం అరుదైన కార్యక్రమం. టీడీపీ నాయకులు, ప్రతిపక్షాలు అభివృద్ది ఎక్కడ ఉంది అంటున్నారు, మీకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. మీ రాజకీయాలకు సమాధి కట్టారని, మీ ఉనికి కరువైందని ఏ ఊర్లో అడిగినా చెబుతారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాల ద్వారా రూ. 2,033 కోట్లు వచ్చాయి, అభివృద్ది రూపంలో రూ. 1,054 కోట్లు వచ్చాయి, మొత్తం కలిపి రూ. 3,087 కోట్లు వచ్చాయి. వివిధ పథకాల ద్వారా మా నియోజకవర్గానికి చాలా లబ్ధి జరిగింది. ఈ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యతను స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చూపించాం, సంతనూతలపాడును మరోసారి గెలిపించుకుంటాం, అప్పటివరకూ విశ్రమించం, టీడీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, రేపు వారు ప్రజల్లోకి వచ్చి ఎలా ఓట్లడుగుతారని ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబు ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top