తాడేపల్లి: 'నారా'సుర వధకు జనం సిద్ధంగా ఉన్నారని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు సిద్ధం సభకు రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, గృహ సారధులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ సందర్భంగా తరలి వస్తున్న ప్రతి ఒక్కరికీ శుభకాంక్షలు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం బలపరుస్తూ.. ఆయన వెంట మనం అంతా ఉన్నామని రాప్తాడు వేదికగా తెలియజేద్దాం. భీమిలి, దెందులూరు సభలతో టీడీపీ, చంద్రబాబుకు బుర్ర పని చేయటం లేదు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన ప్రభంజనంతో దూసుకు వెళ్తుండటంతో చంద్రబాబు ఖాళీ కుర్చీలతో పరాభవం చెందుతున్నాడు. డబ్బులు, మందుబాటిళ్లు, బిర్యానీలు, వాహనాలు ఏర్పాటు చేసి తీసుకు వస్తున్న జనాలను ఎలా సభలో ఉంచుకోవాలో తెలియక.. ఆ ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు, లోకేశ్‌లు నోటికి పనిచెబుతున్నారు. సిద్ధం సభకు ఆశయం, లక్ష్యం ఉంది సిద్ధం సభలకు... బాబు సభలకు.. తేడా గుర్తించండి రాష్ట్ర ప్రజలు, మీడియా సోదరులు, మేధావులు ఈ సభల తీరు తెన్నులను అధ్యయనం చేయాలి. సీఎం జగన్ సిద్ధం సభకు సిద్ధాంత బలం, ఆశయం, లక్ష్యం ఉంది. అంతేకాదు.. సిద్ధం సభలో వైఎస్ఆర్‌సీపీ అంకిత భావం, ఐక్యత ఉంది. రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించటానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు, నాయకుడుకి మధ్య అనుసంధాన కర్తగా పనిచేసిన క్రియాశీలక కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయటానికి కోసమే సిద్ధం అనే సభ. దీని ద్వారా ఎన్నికలకు అందరం సిద్ధం అని.. అందరూ కలసి కట్టుగా వచ్చినా, విడివిడిగా వచ్చినా పోరాటం చేయటానికి కార్యకర్త నుంచి రీజనల్ కో ఆర్డినేటర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు మేం సిద్ధం అని ప్రకటిస్తున్నాం. ప్రజలకు చేసిన మేలును ప్రచారం చేసుకోవటానికే ఈ సిద్ధం సభలు. మా సిద్ధాన్ని క్షేత్రస్థాయిలో చెప్పటానికి ఈ సభలు. ఈ సిద్ధం సభల ద్వారా తన సైన్యాన్ని, బలాన్ని క్రోడీకరించి.. సమరశంఖారావాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి పూరిస్తున్నారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టగలవా చంద్రబాబూ! 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చాను. నేను నెరవేర్చానని నమ్మితేనే ఓటేయండని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఆ డైలాగ్‌లో ఎంత దమ్ముండాలి. నేను మేలు చేశానని మీరు భావిస్తే ఓటు వేయాండని చెబుతున్న తొలి రాజకీయ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. అదే పదాన్ని తన కార్యకర్తలకు, నాయకులకు స్పృహ కల్పిస్తూ తను చేసిన మేలు చెబుతూ ఇంకా చేయాల్సిన మేలు గురించి గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రజల పట్ల జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న అంకిత భావాన్ని చెప్పటమే సిద్ధం సభకు ఉన్న లక్ష్యం. 175/175 స్థానాలు గెలవాలనే ధృడ సంకల్పంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అసలు చంద్రబాబు 175 సీట్లకు టిక్కెట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? అసలు అభ్యర్థులు ఉన్నారా? ఒక్కో స్థానానికి ఎంత మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీడీపీది ఇంకి పోయిన చెరువు. వైఎస్ఆర్‌సీపీలో పోటీ పెరిగింది. నేను పోటీ చేస్తాను అంటే నేను పోటీ చేస్తానని ఆశావాహులు సీటును కేటాయించమని అడుగుతున్నారు. స్వయంకృషితో ఎదిగిన దళిత బిడ్డలం. కార్యకర్తలను ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసిన హీరో జగన్ జగన్ మోహన్ రెడ్డి ఒక యుద్ధాన్ని చేయాలని సంకల్పించినప్పుడు తన సైన్యం ఎలాంటి శక్తియుక్తులు కలిగి ఉండాలో వ్యూహరచనలో భాగంగా కొన్నిచోట్ల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అది ప్రతి రాజకీయ పార్టీ సంస్థాగతంగా చేసుకునే పనే. ఇంకొల్లు సభలో నన్ను, ఎంపీ నందిగం సురేష్‌ను, కరణం బలరాం కృష్ణమూర్తి, ఆమంచి కృష్ణమోహన్‌ను తిట్టావు. ఒకరిని దోపిడీ దొంగలు అని, ఇంకొకరు ఏం పొడిచావో చెప్పు అని తిట్టావు. యువకులు అయిన మేము ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ లేకుండా స్వయంకృషితో వైఎస్‌ఆర్, వైఎస్ఆర్‌సీపీ దయతో ఎదిగి పుట్టిన వాళ్లం నేను, నందిగం సురేష్. కేవలం మమ్మల్ని క్రియాశీల కార్యకర్తలుగా కష్టపడే మనస్తత్వం ఉన్నవారిగా దళిత జాతిలో పుట్టిన మాకు నాయకత్వం చేయగల సమర్థత ఉందని మాకు రాజకీయ పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేశారు. కొడుకునే ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని దద్దమ్మ చంద్రబాబు మాపై విమర్శలా? మేము చంద్రబాబులా అవకాశవాదులం కాదు. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర మాకు ఎవ్వరికీ లేవు. నీది కాని పార్టీని సొంతం చేసుకున్న చరిత్ర మాకేమీ లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కొడుకు మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఆయన్ని షార్ట్‌కట్‌లో ఎమ్మెల్సీ చేశావు. అదీ నీ చరిత్ర. నీ సొంత నాయకత్వం.. నీ కొడుకుకే బలం లేదు. నువ్వు దత్తత తీసుకున్న వాడు రెండు చోట్ల ఓడిపోయాడు. కానీ, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా జగన్ మోహన్ రెడ్డికి మా తల్లిదండ్రుల పేర్లు తెలియకుండా.. మమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేలా చేసిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి. జీరోలు మేం కాదు.. చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడే జీరోలు సుధాకర్ ఒక్క స్టెప్ ఆగు.. అని జగన్ మోహన్ రెడ్డి గారు చెబితే చాలు. ఆనందంగా ఎదురు చూస్తాం. చంద్రబాబు తయారు చేసుకున్న జట్టులో... ఒక్కరైనా అలా ఉన్నారా?. జగన్ మోహన్ రెడ్డి ఒక హీరోలా.. సోనియా గాంధీని ఎదిరించి.. సొంతంగా పార్టీ పెట్టుకుని 151 ఎమ్మెల్యేలు, 33 మంది ఎంపీలతో ఎదిగిన హీరోయిజం నాయకత్వం. మాకు కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ లేకుండా సంస్థాగతంగా ఎదిగిన మమ్మల్ని జీరోలని చంద్రబాబు వ్యాఖ్యానించటం ఏమిటి? మేం ఎలా జీరో అవుతాం. అసలు చంద్రబాబు, లోకేశ్, దత్తత తీసుకున్న కొడుకులే జీరోలు.. నేడు రాయలసీమలో సిద్ధం సభలో నారాసుర వధ రావణాసుర వధకు సిద్ధమని చంద్రబాబు కామెంట్ చేశారు. ఇవాళ రాయలసీమలో నారాసుర వధ ''సిద్ధం'' జరగబోతోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా్ల్లో జరిగిన సభల్లో కానీ, రాయలసీమ సభల్లో ఎక్కడైనా నువ్వు తప్పు పట్టే ఒక్క అంశం ఉందా? చంద్రబాబు ఏది అంటే అది మాట్లాడుతున్నాడు. బాబు దగ్గర కన్నా సీఎం జగన్ దగ్గర కార్యకర్తకే దమ్ము ఎక్కువ హీరోతో ఉంటాం కానీ.. దొంగల ముఠాతో ఉండం స్వయంకృషితో ఎదిగిన నాయకులను పట్టుకుని ఏదంటే అది చంద్రబాబు మాట్లాడుతున్నాడు. టిక్కెట్లు కోల్పోయారు. చీటీ చించేశారని మాట్లాడారు. సంతనూతలపాడు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఒకటి మనవి చేస్తున్నాను. నేను కానీ, మా పార్టీ లో ఏ రాజకీయ నాయకులైనా జగన్ ఆలోచన నుంచి పుడతాం. జగన్ అవకాశం ఇస్తే వచ్చింది. మా రాజకీయ జీవితాలు అన్నీ జగన్ ఇచ్చిన బహుమానాలు. మేం అంతా ఆయన వ్యూహాలకు తగ్గట్లు పనిచేస్తాం. చంద్రబాబు దగ్గర ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేయటం కన్నా.. జగన్ మోహన్ రెడ్డి దగ్గర కార్యకర్తగా పనిచేయటంలో దమ్ము ఉంటుంది. చంద్రబాబు దగ్గర వెన్నుపోటు, దోపిడీ, స్కిల్ దొంగవు. నీ దొంగల ముఠాలో ఎందుకు ఉంటాం. హీరోతోనే ఉంటాం. ప్రజలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా, రాజకీయంలో నిర్ణయాలు అయినా జగన్ బాధ్యతాయుతమైన చర్యలు వ్యవహరిస్తారు. మైనార్టీలు, బీసీలకు జనరల్ స్థానాలు ఇచ్చిన హీరో సీఎం జగన్ ఓసీ సీట్లలోనూ బీసీ నాయకత్వాలను పోటీ పెట్టే దమ్ము, ధైర్యం దేశంలో కేవలం ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే ఉంది. కొంతమంది కాన్షీరాం, మాయావతితో పోలుస్తున్నారు. ఆ గొప్పతనాలు వేరు. వారు ఆ సామాజిక వర్గాల్లో పుట్టి.. ఆ వివక్షను ఎదుర్కొని పైకివచ్చి కాన్షీరాం ఉత్తర ప్రదేశ్‌లో అమలు చేశారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడును అడుగుతున్నా. 175 నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాబడిన అసెంబ్లీ స్థానాలు తప్పించి.. బీసీలకు, మైనార్టీలకు రిజర్వేషన్లు లేవు. మైనార్టీలకు, బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తున్నాడో లెక్క తీయండి. అప్పుడు జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు అంతగా హీరోగా భావిస్తున్నామో, ఆరాధిస్తున్నామో తెలుస్తుంది. ఏనాడైనా బీసీ, ఎస్సీలను రాజ్యసభకు పంపావా బాబూ! 2014-19 చంద్రబాబు హయాంలో ఎంత మంది బీసీలకు రాజ్యసభ సీటు ఇచ్చావు. ఎంత మంది ఎస్సీలను రాజ్యసభకు పంపించావు. ఈరోజున జగన్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబూరావు ను, బీసీ సామాజిక వర్గానికి చెందిన నలుగుర్ని రాజ్యసభ కు పంపించారు. అదీ హీరోయిజం అంటే. అదీ దమ్ముధైర్యం అంటే. అందుకే జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ప్రేమ. ఆయన కళ్లలో ఆనందం చూడటం కోసం టీజేఆర్ సుధాకర్ బాబు లాంటి సైనికులు ఎలాంటి త్యాగాలకు అయినా సిద్ధం. ఆయన కోసం ఏ యుద్ధమైనా చేస్తాం. అది ధర్మయుద్ధమే అయి ఉంటుంది. చేతులు మడత పెట్టమని చెప్పినా.. ఆయన యుద్ధం సామాన్యుల కోసమని, ఇంగ్లీషు మీడియం చదువుకోలేని పేదల కోసమని, ఇళ్లు కట్టుకోలేని పేదల కోసమని, ఇంటి స్థలం లేని నిరుపేదల కోసమని, చేయూత లాంటి ఆడపడుచుల కోసమని, ఆసరా కోసం ఎదురు చూస్తున్న అక్కాచెల్లెలు, వృద్ధులు, వికలాంగుల కోసం. ఊహాజనిత లెక్కల్లో చంద్రబాబు... క్షేత్రస్థాయిలో లెక్కలు వేరు బాబూ మీవన్నీ ఊహాజనితమైన రాజకీయాలు. మీరు చూసిన రాజ్యం.. మేం చూసిన రాజ్యం వేరుగా ఉంది. నారా చంద్రబాబు హైటెక్ మెంటాల్టీతో సాంకేతిక లెక్కలు వేసుకుంటూ అలా జరగబోతోంది. ఇలా జరగబోతోందని ఊహాజనితమైన లెక్కలు చెబుతున్నారు. అవన్నీ గుండు సున్నా. రాష్ట్ర ప్రజలకు, సిద్ధానికి రాబోతున్న కార్యకర్తలకు, రాయలసీమలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లారా జట్టు కట్టండి. దండు కదలి రండి. జగనన్నను చేయిచేయి కలపండి. జగనన్న భుజాన కాద్దాం. జగనన్న ను భుజాన ఎత్తుకుందాం. జగనన్న కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధం పడదాం. జగనన్నను ముఖ్యమంత్రి చేస్తేనే మన గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో నిర్మితమైన భవనాల సంఖ్య ఎంత? కట్టిన ఆర్‌బీకే సెంటర్లు ఎన్ని? సచివాలయాలు ఎన్ని? బల్క్ మిల్క్ సెంటర్లు ఎన్ని? డిజిటల్ లైబ్రరీలు ఎన్ని? నాడు-నేడు పేరుతో మన బిడ్డలు చదువుతున్న స్కూల్స్ ఎన్ని మార్పులు జరిగాయి? దానికి అయిన ఖర్చు ఎంత? మన ఇంటికి వచ్చిన డబ్బుల విలువ ఎంతో బేరీజు వేసుకుందాం. ఈరోజు రాయలసీమ సిద్ధానికి తరలివద్దాం. అగ్రవర్ణ పేదలూ జగన్ మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తామంటున్నారు రాయలసీమలో సిద్ధం అంటే.. యుద్ధమే. సామాన్యుడి గెలుపు కోసం రాజు యుద్ధం పూనాడు. ఆ యుద్ధాన్ని గెలిపించకుంటే సామాన్యుడు విజయం ఆగుతుంది. 2024లో జగన్ మోహన్ రెడ్డి గెలిస్తేనే సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాల వారిలో పేదవారు ఈబీసీ, కాపు నేస్తం తీసుకుంటున్నారు. వారంతా జగన్ మోహన్ రెడ్డికి ఓటేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ భవనం దగ్గర సెల్ఫీ దిగి.. ప్రజలకు అంకితం ఇస్తావా లోకేశూ! లోకేష్ విశాఖలో సెల్ఫీ దిగాడు. అమరావతిలో ఎక్కడైనా సెల్ఫీ దిగే అవకాశం ఉంటే చెప్పండి. జగన్ మోహన్ రెడ్డి రుషికొండ మీద ప్రభుత్వ భవన నిర్మాణం చేశాడు. అది ప్రజల ఆస్తి. ప్రజల కట్టడం. అక్కడ సెల్ఫీ దిగి.. ప్రజలకు అంకితం ఇస్తానని అంటాడు. మీ మైండ్‌లు పోయాయని అంటే ఏడుస్తారు. మమ్మల్ని ఎలా అంటే అలా అనిపిస్తున్నారని అంటారు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా రుషికొండ బిల్డింగ్ దగ్గర సెల్ఫీ దిగి.. జాతికి అంకితం ఇస్తానంటే ఏమి చెప్పాలి. గతంలో పవన్ కల్యాణ్ వెళ్లాడు. అది ప్రభుత్వ భవనం. కరకట్ట మీద లాంటి దొంగ నిర్మాణాలు కాదు. తాత్కాలికం పేరుతో అడుగుకు రూ.11000 ఖర్చు చేసింది చంద్రబాబే నూతన రాజధాని పేరుతో కేంద్రం ఇచ్చిన డబ్బులు తాత్కాలిక రాజధాని పేరుతో అడుగుకు రూ.11000 ఖర్చు చేశారు. ప్రపంచంలో ఇలాంటి ఖర్చు ఉంటుందా? అలాంటి నిర్మాణాలు కాదని.. రైతులను మోసం చేసింది మీరే. వారి ఉసురే మీకు తగిలి తండ్రీ కొడుకులు (చంద్రబాబు, లోకేశ్‌లు) దేశదిమ్మర్లై తిరుగుతున్నారు. వారు ఈ రాష్ట్రంలో ఇళ్లు కట్టుకోవాలని ఆహ్వానిస్తున్నా. టిడిపి , పవన్ కల్యాణ్, లేదా ఇంకో పార్టీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కలసి కట్టుగా రావాలి. మళ్లీ ఈరాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 2024-29 వరకు పరిపాలించబోయేది జగన్ మోహన్ రెడ్డి గారే.