ఇకనైనా బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోండి

విపత్కర సమయంలో నీచ రాజకీయం చేయడం దుర్మార్గం

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం

అనంతపురం: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలని, విపత్కర సమయంలో కూడా ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేయడం దుర్మార్గమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షనేత హోదాలో ఉండి ఆపద సమయంలో హైదరాబాద్‌లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం హేయనీయమన్నారు. రాప్తాడులో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. అధికంగా కరోనా పరీక్షలు చేయటం వల్లనే కోవిడ్‌ నియంత్రణ సాధ్యమైందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు మూడు విడతలు ఉచిత రేషన్, ప్రతి పేద కుటుంబానికి రూ. 1000 నగదు ఇచ్చి పేదలను ఆదుకున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అని ప్రకాష్‌రెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, మత్స్యకారులు స్వస్థలాలకు చేరారన్నారు. 
 

Back to Top