మహనీయులు కోరిన సమాజం జననేతతోనే సాధ్యం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
 

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, తన తండ్రి ఒక్క అడుగు ముందుకు వేస్తే తాను రెండు అడుగులు ముందుకువేస్తానని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల మేలు కోసం చట్టాలు తీసుకువచ్చారన్నారు. దళిత వాడలో పుట్టిన తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, నందిగాం సురేష్‌ను పార్లమెంట్‌లో కూర్చోబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. మహనీయులు కోరిన సమసమాజం సీఎం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందని, రాజకీయాల్లో జననేత కొత్త విప్లవం తీసుకువచ్చారన్నారు. సభలో మంత్రి గుమ్మనూరు జయరాం ప్రవేశపెట్టిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బిల్లుకు సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు చెప్పారు.

Back to Top