అమరావతి: చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని, వైయస్ఆర్ హయాంలో మళ్లీ రైతులకు మంచి రోజులొచ్చాయని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి మహానేత వైఎస్సార్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్బంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.
- తన కడుపు మాడ్చుకుని అందరి కడుపు నింపడానికి అనునిత్యం పొలంలో ఉంటూ, అనునిత్యం ఆలోచించే వ్యక్తి రైతు
- తన కడుపు మాడ్చుకుని తన కడుపు నింపే రైతు కోసం మాట్లాడుకోవాలి
- దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా పేరుపొందింది మన రాష్ట్రం.
- 2004 వరకూ వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది.
- వ్యవసాయం దండగ అనే ఓ ప్రభుత్వ నేత ఆధ్వర్యంలో వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేసారు.
- దానికి తోడు కరువు కాటకాలు, నక్సలిజం సమస్యలు, లా అండ్ ఆర్డర్ లేకుండా పల్లెల్లో నివసించేవాళ్లే లేకుండా పోయారు.
- ఎక్కడ చూసినా వలసలే.
- తన పాదయాత్రలో ఇందంతా చూసిన వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక తన ప్రాధాన్యత వ్యవసాయరంగం అని చెప్పారు.
- జలయజ్ఞం పేరుతో కోటి ఎకరాలకు నీళ్లివ్వాలని సంకల్పించారు.
- కరువును తరిమికొట్టాలని, రైతుల ఆత్మహత్యలు తగ్గించాలని అనేక మార్పులు తెచ్చి, ప్రతి అడుగులో రైతుకు తోడున్నారు.
- నక్సలిజాన్ని కంట్రోల్ చేసి, వలసలు తగ్గించి, మళ్లీ పల్లెల్లో వ్యవసాయాన్ని పండుగలా చేసారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.
- రైతు పొలానికి వెళ్లి పంటకు నీళ్లు పెట్టుకోబోతే రైతును హింసించి, బకాయిలు చెల్లించమని వేధించి, వైర్లు కట్ చేసి, రైతులపై కేసులు పెట్టి అరెస్టులు చేయించే పరిస్థితిని తాను అధికారంలోకి వస్తూ ఒక్క సంతకంతో మార్చారు వైయస్సార్.
- రైతుల విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ, రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెడుతూ తొలిసంతకం చేసి, లక్షలాది మంది రైతులకు మేలు చేసారు.
- వ్యవసాయన్ని పండగ చేసింది వైయస్సార్.
- ఆయన మరణం తర్వాత వ్యవసాయ రంగం మళ్లీ నిర్లక్ష్యానికి గురైంది.
- వైయస్ జగన్ ఈ సమయంలోనే రైతుల కష్టాలను చూసారు. రైతు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరిగి అప్పులపాలౌతున్న పరిస్థితిని అర్థం చేసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 12వేలు చొప్పున 4ఏళ్లు ఇస్తానని వాగ్దానం చేసారు.
- అధికారంలోకి వచ్చాక చెప్పినదానికంటే ఎక్కువగా 5 ఏళ్లపాటు మరో వేయి ఎక్కువ చేసి మరీ రైతుకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
- మూడున్నర ఏళ్లలో రూ.23,850 కోట్లను రైతుభరోసా ద్వారా రైతులకు అందించారు సీఎం వైయస్ జగన్.
- గతంలో చంద్రబాబు నన్ను గెలిపిస్తే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను, బంగారం అంతా విడిపిస్తానని చెప్పి టీవీల్లో పెద్ద ఎత్తున్న ప్రచారం చేసుకున్నాడు.
- కానీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ పై తొలి సంతకం అంటూ చెప్పి, దాన్ని కూడా పూర్తి చేయకుండా మోసం చేసాడు. మేనిఫెస్టోనే మాయం చేసాడు. బాబు ఐదేళ్ల హయాంలో రైతుల కోసం చేసిన ఖర్చు 14వేలకోట్లు మాత్రమే.
- వైయస్ జగన్ ఈ మూడున్నర ఏళ్లలో రైతు భరోసా 23 వేలకు పైగా కోట్లు మాత్రమే కాక, పంటదెబ్బతింటే ఏసీజన్ కి ఆసీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ 6,800 కోట్లు అందించారు.
- రైతుభరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ల కోసమే 33,500 కోట్లను ఖర్చు చేసింది మన జగనన్న ప్రభుత్వం.
- ఇవే కాకుండా గత ప్రభుత్వం పెట్టిన ఉచిత విద్యుత్ బకాయిలు 9వేల కోట్లు తీర్చడమే కాకుండా ఇప్పుడు ఏడాదికి 8వేల కోట్లు ఉచిత విద్యుత్ కోసం ఖర్చు చేస్తున్నాం.
- ఇలాంటి ప్రభుత్వంపై టీడీపీ విమర్శలుచేస్తోంది. రైతుల పంపులసెట్లకు మోటర్లు బిగిస్తారంట..వ్యతిరేకిద్దాం అని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.
- ఉచిత విద్యుత్ విషయంలో దేశానికే దిక్సూచిగా మారిన వైయస్సార్ ఆశయాలతో పనిచేస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వం రైతులపై భారం మోపుతుందా?
- రైతులపై ఒక్క రూపాయి కూడా భారం వేయము.
- రైతులు నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకుని ఉండొచ్చు
- వైయస్ జగన్ ప్రభుత్వం రైతులపై భారం వేయదు.
- రానున్న 30 ఏళ్లలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనే ప్రణాళిక రూపొందించారు వైయస్ జగన్.
- అవన్నీ ప్రజలకు తెలియనీయకుండా రాజకీయ కోణంలో బురదచల్లాలనే ప్రయత్నంతోనే టీడీపీ ఉంటోంది.
- దేశం మొత్తంలో ఉచిత విద్యుత్ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డిగారు.
- ఆయన తర్వాత కేవలం 5 రాష్ట్రాలు మాత్రమే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
- తండ్రి ఒక్క అడుగు వేస్తే తాను నాలుగు అడుగులు వేసే కొడుకు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే ఆయన ఆధ్వర్యంలో మన ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందా?
- రైతులకు ఈ సభ నుండి మాటిస్తున్నాం...రైతులు మోటర్ల గురించి ఆందోళన పడకండి. ధైర్యంగా ఉండండి. రైతులపై ఏదైనా భారం పడితే దానికి మేము బాధ్యత వహిస్తాం.
- రైతులకు అన్ని అంశాల్లో కలిపి లక్ష కోట్ల మేర మేలు చేసాం. కనుక రైతులంతా ఏ సమస్యా లేకుండా ఉన్నారని మేము భావించడం లేదు.
- వారికి మరింత సహకారం అందించాలన్నదే మా ఉద్దేశం
- నేడు రైతులు చెబుతున్న పెద్ద సమస్య కూలీలు దొరకడం లేదని..
- ఎకరా ఐదు సెంట్లులోపు ఉన్న రైతులు 67% ఉన్నారు.
- 3ఎకరాల లోపు ఉన్నవాళ్లు 20% ఉన్నారు.
- ఈ లెక్కన 90% రైతులు 3 ఎకరాల లోపు భూమి ఉన్నవారే..
- సంక్షేమ పథకాలు అందడం వల్లే మాకు కూలీలు దొరకడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
- ఇది కరెక్ట్ కాదు..
- కూలివాడు ఎప్పుడూ కూలివాడుగానే ఉండాలా?
- జీవనశైలి మెరుగుపరుచుకోవద్దా?
- కొన్ని దశాబ్దాల ముందు పేదవాడు మూడుపూటలా కడుపు నింపుకోవడమే కష్టంగా ఉండేది.
- నేడు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గింది.
- విద్యార్థులు ఫీజ్ రీయంబర్స్మెంట్ వల్ల ఉద్యోగాలు సాధించుకున్నారు.
- ఇళ్లు కట్టుకుని, వారి కుటుంబాలను బాగా చూసుకుంటున్నారు.
- రైతులకు ఆదాయం తక్కువగా ఉంటోంది. అలాంటప్పుడు ప్రభుత్వం వారిని ఆదుకోవాలి.
- రైతులు సంతోషంగా ఉంటేనే, రాష్ట్రం సంతోషంగా ఉంటుందని నమ్మిన ప్రభుత్వం కనుకే రైతు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతోంది.
- ఈ క్రాపింగ్ నమోదు చేస్తే పంటనష్టానికి ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారి అకౌంట్లలో జమ అవ్వడం గతంలో ఎప్పుడూ జరగలేదు. నేడు వైయస్ జగన్ హయాంలో అది జరుగుతోంది
-