రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

రాష్ట్ర ఎద్దుల బండ‌లాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ‌దేవి

క‌ర్నూలు: ‌ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ ప‌త్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి  అన్నారు. శనివారం తుగ్గలి మండలం మారేళ్ళ గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సంక్షేమ పథకాలను అందిస్తుంద‌న్నారు. క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను తీసుకువచ్చిందని చెప్పారు. రైతు భరోసా పథకంలో సబ్సిడీపై విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు అందజేస్తుందని తెలిపారు. గ్రామ స్థాయిలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వరిధాన్యం, వేరు శనగ, సజ్జలు, కొర్రలు కొనుగోలు చేస్తున్నామన్నారు.  పంటలను కొనుగోలు చేసి రైతులు తక్కువ ధరలకు అమ్ముకోకుండా ప్రభుత్వం మద్దతు ధరలకు పంటల దిగుబడులను అమ్ముకోవాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. 

Back to Top