ప్ర‌తి మ‌హిళా విజ‌యం వెనుక సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ఎమ్మెల్యే శ్రీ‌దేవి
 

అమ‌రావ‌తి:  రాష్ట్రంలోని ప్ర‌తి మ‌హిళా విజ‌యం వెనుక ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్నార‌ని ప‌త్తికొండ ఎమ్మెల్యే కే.శ్రీ‌దేవి పేర్కొన్నారు. అసెంబ్లీ స‌మావేశాల్లో మ‌హిళా సాధికార‌త‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆమె మాట్లాడారు. క‌డుపులో ఉన్న బిడ్డ మొద‌లు పండు ముదుస‌లి వ‌ర‌కు అన్ని వ‌ర్గాల వారికి సీఎం  వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నారని తెలిపారు. పిల్ల‌ల‌ను బాగా చ‌దివించాల‌ని అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా ప్ర‌తి త‌ల్లి ఖాతాలో నేరుగా ఏటా రూ.15 వేలుఅంద‌జేస్తున్నార‌ని చెప్పారు.  డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాన‌ని మాట ఇచ్చి..అధికారంలోకి వ‌చ్చాక‌ బ్యాంకు ద్వారా ఎవరితో సంబంధం లేకుండా బ్యాంకు ఖాతాలో జ‌మ చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.   దేశంలోనే తొలిసారిగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కూడా ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ప్రతి విద్యార్థి కి పూర్తి స్థాయి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అంద‌జేస్తున్నార‌ని చెప్పారు. ద‌శ‌ల వారిగా మ‌ద్య‌పాన నిషేదం కోసం బెల్ట్‌షాపులు ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా వైన్ షాపుల సంఖ్య‌ను క్ర‌మంగా త‌గ్గించార‌న్నారు.  మద్యనిషేధం వల్ల నష్టాలు తగ్గిన పర్వాలేదు కానీ పేదల క‌ష్టాలు తీర్చడానికి ముందుకు వచ్చారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుట్టాలని చెప్పేసి.. ఆడపిల్ల కావాలని కోరుకునే రోజులు వ‌చ్చాయ‌ని తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top