మున్సిపల్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం సాధిస్తుంది

నంద్యాల పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు, శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి
 

క‌ర్నూలు:  రాష్ట్రంలో జ‌రుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నంద్యాల పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు, శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్ల నగర పంచాయతీ  ఎన్నికల ప్రచారంలో  మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డితో క‌లిసి నంద్యాల పార్లమెంట్  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి , కర్నూల్ నగర మేయర్ బివై.రామయ్య , ఎన్నికల ఇంచార్జ్ మాజీ మంత్రివర్యులు రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు చంద్రబాబు నిరంతరం అడ్డుపడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం తప్పా? అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ప్రాంతాల వారీగా అలజడి సృష్టించేందుకే చంద్ర‌బాబు కుట్ర చేస్తున్నారని విమ‌ర్శించారు.  పేద ప్రజల బాగు కోసం సీఎం వైయ‌స్ జగన్‌ ఆరాటప‌డుతున్నార‌ని చెప్పారు.  అమరావతి ప్రాంతంలోని గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లను ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీకి  కట్టబెట్టారని.. అయినా చంద్రబాబుకు ఇంకా సిగ్గు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు వైయ‌స్సార్‌సీపీ వెంట ఉన్నారని, 2019 త‌రువాత ఏ ఎన్నిక జ‌రిగినా ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌ని, ఇక ముందు కూడా అదే జ‌రుగుతుంద‌న్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top