ఏపీని సస్యశ్యామలం చేయడమే సీఎం జగన్‌ లక్ష్యం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్‌ రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లాః ఏపీని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భగిరత్న ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. ప్రతి ఏడాది 3వేల టీఎసీంల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి నీరు తరలిస్తే రాయలసీమలో సాగు,తాగునీరు కష్టాలు తీరతాయని తెలిపారు.వృధాగా పోయే గోదావరి నీటి వినియోగానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందు అడుగువేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Back to Top