పేదవాడికి సొంతింటి కల సీఎం ఆశయం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
 

అమరావతి: ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 48 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 48 లక్షల ఇళ్లను కట్టించి మహానేత రికార్డు సృష్టించారన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇంటి నిర్మాణాలను పూర్తిగా విస్మరించాయన్నారు. గత ప్రభుత్వంలో గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణంలో కేవలం 8 లక్షల ఇళ్లను కట్టారు. అప్పుడో ఎంతో అవినీతి జరిగిందని, జన్మభూమి కమిటీల చేతిలో ఇళ్ల నిర్మాణాలను పెట్టి భారీ స్థాయిలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. 

ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలని, ఉగాది పండుగ రోజున పంపిణీ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెలే ఉదయభాను చెప్పారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉగాది రోజున పెద్ద పండుగలా స్థలాల పంపిణీ చేసి వచ్చే ఏడాది ఇంటి నిర్మాణాలు కూడా చేపడుతామని చెప్పారు. దీని వల్ల ఎంతో మంది ఉపాధి పొందుతారని, కూలీలు, మేస్తీ్రలు, సెంట్రింగ్, కార్పెంటర్, రాడ్‌ బెండర్స్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌ ఇలా అనేక మంది హౌసింగ్‌ పథకంతో ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. గత ప్రభుత్వం కొండంత చెప్పి.. గోరంత చేసిందన్నారు. కానీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పారదర్శకతతో పథకాలను అమలు చేస్తుందన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా పథకాలను అమలు చేస్తామన్నారు. ఇంటిని మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయిస్తామన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top