మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్‌లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
లోకేశ్‌కు మతి భ్రమించింది
08 Aug 2019 7:10 PM
ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా
అనంతపురం : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేశ్‌కు మతి భ్రమించిందని ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు, లోకేశ్‌లు యువతను మోసం చేశారని మండిపడ్డారు. గురువారం జిల్లాలోని పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్ మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కార్‌ను మార్కెట్లోకి విడుదల చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. 4 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనత అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందేలా సీఎం వైఎస్ జగన్ చట్టం చేశారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొదిస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు.