శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా

తిరుమ‌ల‌: క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా  ద‌ర్శించుకున్నారు. బుధ‌వారం ఉద‌యం బ్రేక్ ద‌ర్శ‌నంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకొని తీర్థ‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొన్నారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నరక చతుర్దశి పర్వదినాన దీపావళి వెలుగులా ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు రావాలని కోరుకుంటున్నన్నారు. ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top