ఆస్తుల కోసమే చంద్రబాబు పోరాటం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

తిరుపతి: అమరావతిలో రైతులను మోసం చేసి కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మండలి వద్దన్న చంద్రబాబు.. తన కొడుకు లోకేష్‌ పదవి పోతుందని యూటర్న్‌ తీసుకున్నాడన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం చంద్రబాబు నైజమని, అవసరానికి ఎన్ని మాటలైన మార్చేస్తాడన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదికను భోగి మంటల్లో వేసి చలికాచుకున్న వారు.. ఇప్పుడు ఆ కమిటీ రిపోర్టుపై అసత్య ప్రచారం చేస్తుందన్నారు.

Back to Top