మహిళా సంక్షేమ మహాచక్రవర్తి సీఎం వైయస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ గడ్డ.. జగనన్న అడ్డా..

ఎంతమంది గుంపులుగా వచ్చినా.. జగనన్న సింహంలా వచ్చి మట్టికరిపిస్తాడు

టీడీపీ అంటే తెలుగు దుశ్శాసనుల పార్టీ.. అందరూ మహిళా వ్యతిరేకులే

మహిళలను మహారాణులను చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే సొంతం

మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా

విజయవాడ: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి.. ఎంతోమంది నాయకులు వచ్చారు.. వెళ్లారు. వారెవరికీ సాధ్యం కానీ మహిళా సాధికారతను అక్షరాల ఆచరణలో పెట్టి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కే దక్కిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ లాంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ చూసి ఉండరని, అది మన ఆంధ్రరాష్ట్ర అక్కచెల్లెమ్మల అదృష్టమన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించొచ్చు అనే నమ్మకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ కలిగించారన్నారు. మహిళా ఆత్మగౌరవానికి, సాధికారతకు మహిళా దినోత్సవ కార్యక్రమం అద్దంపడుతుందన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొని మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఏం మాట్లాడారంటే..
‘‘ప్రతీ సంవత్సరం మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతూనే ఉన్నాం. నా జీవితంలో ఏరోజూ కలగని ఆనందం.. ఈ రోజు ఈ వేదికపై మాట్లాడుతుంటే కలుగుతుంది. మహిళల మీద నమ్మకంతో ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌ మహిళలందరికీ అన్న కాదు.. దేవుడుతో సమానం. ఒక కుటుంబంలో తండ్రి, అన్నలు, భర్త, ఇలా రక్తసంబంధం ఉంటుంది కాబట్టి సపోర్టు చేశారు అంటే అర్థం ఉంటుంది. మనతో ఏ సంబంధం లేకపోయినా తన కుటుంబ సభ్యులుగా, అక్కచెల్లెలుగా గుర్తించి అవకాశాలు ఇవ్వడం మామూలు విషయం కాదు. 

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎంతోమంది నాయకులు వచ్చారు.. వెళ్లారు. వారెవరికీ సాధ్యం కానీ మహిళా సాధికారతను అక్షరాల ఆచరణలో పెట్టి చూపించారు. మహిళలకు హక్కులు, అవకాశాలు, ఆర్థికసాయం, రాజకీయ అవకాశాలు కావాలన్నా.. రోడ్లు ఎక్కిపోరాడాలి. అందరితో చీత్కారాలు పొందాలి. పోలీసుల చేత దెబ్బలు తినే పరిస్థితి ఉండేది. కానీ, ఏ మహిళా సంఘం పోరాడకుండానే, ఏ ప్రజాసంఘం ప్రశ్నించకుండానే, ఏ ప్రతిపక్షం కలలో కూడా ఊహించని విధంగా మహిళలను మహారాణులను చేసి మహిళా సాధికారతకు పట్టం కట్టే విధంగా జగనన్న మనందరినీ చేతులుపట్టి నడిపిస్తున్నాడు. రెండున్నరేళ్లలో దాదాపు రూ.80 వేల కోట్లను వివిధ పథకాల రూపంలో మహిళలందరికీ ఇచ్చిన మకుటం లేని మహిళా సంక్షేమ మహాచక్రవర్తి సీఎం వైయస్‌ జగన్‌. 

సీఎం వైయస్‌ జగన్‌ గురించి ప్రతిపక్ష పార్టీ, ఎల్లో మీడియా ఏ విధంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలోని నాయకులకు మహిళల గురించి, జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా..? ఐదేళ్ల పాటు నారావారి నరకాసుర పాలన ఎలా ఉంటుందో మహిళలంతా గమనించారు. టీడీపీ మహిళలకు ఏం చేసిందని సీఎం గురించి మాట్లాడుతున్నారు..? 

టీడీపీ అంటే తెలుగు దుశ్శాసనుల పార్టీ. బుద్ధి మందగించిన చంద్రబాబు నుంచి బుద్ధిలేని బుద్ధా వెంకన్న వరకు అందరూ కూడా మహిళా వ్యతిరేకులే. ఇదే విజయవాడలో మహిళా పార్లమెంట్‌ పెట్టి కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని మహిళ పుట్టుకనే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు. కారు గ్యారేజీలో ఉండాలి.. మహిళ వంటింట్లో ఉండాలని మాట్లాడిన అప్పటి స్పీకర్‌. లోకేష్‌ ఎలా ఆడపిల్లలతో డ్యాన్సులు వేశాడో చూశాం. లోకేష్‌ పీఏ తెలుగు మహిళలను ఏ విధంగా లైంగిక వేధింపులకు గురిచేశారో ఆ మహిళా నేతలు, కార్యకర్తలు ఆఫీస్‌ ముందు ధర్నా చేశారంటే.. మహిళలకు వారిచ్చే గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. పదవి కోసం దేవినేని ఉమ వదినను చంపారని విజయవాడలో అందరూ చెప్పుకుంటారు. చేసిన తప్పును నిలదీసిన ఎమ్మార్వో వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని ప్రభాకర్‌ను చూశాం. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌తో ఆడవారి జీవితాలను నాశనం చేసిన బుద్ధా వెంకన్నను చూశాం. తల్లీబిడ్డలను కొట్టి బోండా ఉమాను చూశాం. మహిళను బూటుకాలుతో తన్నిన అచ్చెన్నాయుడిని చూశాం. ఇలాంటివారున్న టీడీపీ ఏ విధంగా మహిళలకు గౌరవం ఇస్తుంది. 

అచ్చెన్నాయుడు ప్రెస్‌మీట్‌ పెట్టి పెద్దజోక్‌ వేశాడు. ఈరాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. టీడీపీ 160 సీట్లు సాధిస్తుందని చెప్పాడు. ఇదే అచ్చెన్నాయుడు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల సమయంలో.. పార్టీ లేదు బొక్కా లేదు అని మాట్లాడారు. గట్టి చెట్నీ గట్టిగా తింటే 160 కిలోలు పెరుగుతావేమో కానీ, చంద్రబాబు, నువ్వు తలకిందులు తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. 23 సీట్లు రావడం కూడా కష్టమే. మరీ అంత సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకురా.. బూటుకాలుతో మహిళను తన్నిన నీకు.. ప్రతీ పోలింగ్‌ బూత్‌లో మహిళలు తన సత్తా చూపిస్తారు. 

ఎవడు పడితే వాడు వచ్చి ఓడిస్తానంటే.. ఊరుకోవడానికి ఇది మీ అడ్డాకాదు బిడ్డా.. ఆంధ్రప్రదేశ్‌ గడ్డ.. జగనన్న అడ్డా. చూశారు కదా మొన్ననే ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌లో వార్‌ వన్‌సైడ్‌ అన్నట్టుగా వైయస్‌ఆర్‌ సీపీకి ప్రజలు పట్టం కట్టారు. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో ఆయనే మన జగనన్న. 

మీడియాను మేనేజ్‌ చేస్తున్నాం. తోక పార్టీలను కలిపేసుకున్నాం. ఐదేళ్లు మనం చేసిన పాపాలు ప్రజలు మరిచిపోయారని గుంపులుగా గుంటనక్కలు, గుండెలు తీసిన బంటులు ప్లాన్‌లు వేసుకుంటున్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా జగనన్న సింహంలా సింగిల్‌గా వచ్చి మట్టికరిపిస్తాడు. జగనన్న వ్యక్తి కాదు.. ఆయన వెనక ఐదు కోట్ల మంది ప్రజల శక్తి ఉంది. రెండున్నర కోట్ల మహిళా శక్తి ఉంది. మహిళల ఆశీర్వాదాలు ఉన్నంత వరకు జగనన్న కాలి చిటికెన వేలు మీదున్న వెంట్రుక కూడా ఏ పార్టీ పీకలేదు. 

మహిళల జీవితాలను నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు.. మహిళల జీవితాల్లో వెలుగు నింపిన కారణజన్ముడు మన జగనన్న. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌. చంద్రబాబు ఛీటర్‌.. జగనన్న లీడర్, చంద్రబాబు మోసగాడు.. జగనన్న మొనగాడు. మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తీసేసిన చంద్రబాబు ఎక్కడా.. తాను ఇచ్చిన మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌ ఎక్కడ. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు మహిళలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు. కానీ జగనన్న 32 లక్షల మంది మహిళలకు ఇంటిపట్టాలు ఇచ్చారు. అన్నగా ఆస్తిని క్రియేట్‌ చేశారు.  చంద్రబాబు, జగనన్నకు మధ్య నక్కకు,  నాగలోకానికి ఉన్న తేడా ఉంది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top