చరిత్రకారుడు సీఎం జగనన్న

జగనన్న అమ్మఒడి పథకం.. విప్లవాత్మక పథకం

చిత్తూరు జిల్లాలో పుట్టి జిల్లా పరువు తీసిన చరిత్రహీనుడు చంద్రబాబు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

చిత్తూరు: జగనన్న అమ్మఒడి పథకం సువర్ణ అధ్యయాన్ని రాయబోయే పథకమని, అమ్మఒడికి చిత్తూరు గడ్డ వేదికైనందుకు సంతోషంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గతేడాది జనవరి 9న ఓ చరిత్రాత్మక ఘట్టానికి (ప్రజాసంకల్పయాత్ర) ముగింపు పలికితే అదే రోజు దేశ చరిత్రలో సువర్ణ అధ్యయాన్ని రాయబోయే పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగనన్నకు హృదయపూర్వక ఎమ్మెల్యే రోజా ధన్యవాదాలు తెలియజేశారు. చిత్తూరులోని జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘ఆనాడు పాదయాత్రలో పేదవాడి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగిన జగనన్న ఈ రోజు అదే పేదవాడి బిడ్డలను బడికి వెళ్లేందుకు గొప్ప పథకాన్ని తీసుకువచ్చారన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం ఓ విప్లవాత్మకమైన పథకం అని, ప్రతి బిడ్డ చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆలోచించి ఆనాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ తీసుకువస్తే.. ఈ రోజు జగనన్న నాలుగు అడుగులు ముందుకేసి అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారన్నారు.

ఇన్నాళ్లూ పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అని నేర్పించాము.. ఈ రోజు నుంచి అ అంటే అమ్మ ఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌ అనే విధంగా ఈ పథకం పిల్లలందరికీ నేర్పిస్తుందన్నారు. గుడి లేని దైవం అమ్మ. కల్మశం లేని ప్రేమ అమ్మ. అమృతం కంటే తీయనిది అమ్మ. అలాంటి అమ్మ వంటి ప్రేమ కలిగింది ఈ  అమ్మ ఒడి అని సంతోషంగా చెప్పగలను అన్నారు. చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లా వాసులు తలదించుకునేలా.. చిత్తూరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేలా గత ముఖ్యమంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు.

పేదల చదువు కోసం అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చిన చరిత్రకారుడు జగనన్న. పేదల చదువును కార్పొరేట్‌ స్కూళ్లకు, కాలేజీలకు బలిచేసిన చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు. పేదోడి చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చిన చరిత్రకారుడు జగనన్న అయితే.. పేదలు చదివి ఆరు వేల పాఠశాలలను మూసివేసిన చరిత్రహీనుడు చంద్రబాబు. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న చరిత్రకారుడు జగన్‌ అన్న అయితే.. ఆ పేదలు తినే గుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని చెప్పవచ్చు అన్నారు. నాడు – నేడు పథకం ద్వారా 45 వేల పాఠశాలలను ఆధునీకరించి అన్ని రకాల వసతులు కల్పించి కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా చేస్తున్న చరిత్రకారుడు జగనన్న అయితే.. తాను చదివిన పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేని చేతగాని చరిత్ర హీనుడు చంద్రబాబు అని చెప్పవచ్చు అన్నారు. పేదలు చదువుకునేందుకు పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్‌ ఇచ్చిన చరిత్ర కారుడు జగన్‌ అన్న అయితే.. ఆ ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని రూ. 30 వేలకు కుదించిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని చెప్పవచ్చు అన్నారు. పేదల కుటుంబాలను ఆదుకునేందుకు జగనన్న వేస్తున్న అడుగులు ప్రజలంతా అభినందించాలన్నారు. చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడిని ప్రారంభిస్తున్న జగనన్నకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

 

Back to Top