జగనన్న సుపరిపాలన..సూపర్‌ పాలన

ఎమ్మెల్యే ఆర్కే రోజా

సుపరిపాలనలో జగనన్న ప్రభుత్వం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది

తన పాలనతో అందరి గుండెల్లో వైయస్‌ఆర్‌ స్థిరస్థాయిగా నిలిచారు

రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని జనం పట్టం కట్టారు

కరోనా కష్టకాలంలో వైయస్‌ జగన్‌ ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్నారు

గుడ్‌ గవర్నెన్స్‌ ర్యాంకుల్లో కూడా ఏపీ అగ్రగామిగా నిలిచింది

పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో ఉంది

పచ్చ పార్టీ నేతలకు, ఎల్లోమీడియాకు విమర్శించడమే పని 

బెస్ట్‌ సీఎంగా వైయస్‌ జగన్‌ అందరి మన్ననలు పొందారు

అమరావతి: సుపరి పాలనతో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూపర్‌ పాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన పరిపాలనతో అందరి గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. మళ్లీ మా రాజన్న పాలన రావాలంటే ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు మూడేళ్ల క్రితం వైయస్‌ఆర్‌సీపీకి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారు. వైయస్‌ జగన గడిచిన మూడేళ్ల పాలన చూస్తే మా రాజన్నే అధికారంలో ఉన్నాడని, వైయస్‌ జగనన్నే రాజన్న రాజ్యం తెచ్చారని వైయస్‌ రాజశేఖరరెడ్డిని అభిమానించిన ప్రతి గుండె ఈ రోజు గవర్వపడుతోంది.
ఈ రాçష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఈ బడ్జెట్‌ నాది అన్నట్లుగా ఉంది.  ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
 మా సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పుడు ఒక మాట చెబుతుంటారు. మనమేంటో మనం చెప్పడం కాదు.. మన పని చెప్పాలి అంటారు. మూడేళ్లుగా తన పనితీరు చూశాక  వైయస్‌ జగన్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్ష్యాత్తు నీతి అయోగ్‌ చెప్పింది. 2020–2021వ సంవత్సరంలో మన  ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో ఐదో స్థానంలో ఉందని చెప్పింది. ఆరోగ్య రక్షణలో మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది. గృహ సౌకర్యాలు కలిగిన రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. 91 శాతం కంటే ఎక్కువ పాఠశాలల్లో భవన సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్‌ వసతి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని నీతి అయోగ్‌ చెప్పింది. ఇది మన దేశ సగటులో 7 శాతం అధికమని చెప్పవచ్చు. వైద్యరంగంలో వైద్యులు, నర్సులు ఉన్న రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఏపీ ఉందని నీతి అయోగ్‌ ప్రకటించింది.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఏపీ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గుడ్‌ గవర్నెన్స్‌ ర్యాంకుల్లో ఏపీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. ఇదంతా జగనన్న పాలనే కారణమని గర్వంగా చెబుతున్నాను. 
ప్రపంచమే కరోనా విపత్తులో అతలాకుతలం కావడం, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కోవడంలో దేశంలోనే ఏపీ మూడోవ ర్యాంకును పొందింది. మన చుట్టుపక్క రాష్ట్రాల్లో టెస్టింగ్, ట్రిట్‌మెంట్‌ కోసం ప్రజలు సొంత ఖర్చులతో అప్పులపాలు అయ్యారు. మన రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు టెస్టింగ్, ట్రిట్‌మెంట్‌ను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉచితంగా అందించి ఆదుకున్నారు. ప్రధాని మంత్రి నుంచి ఒడిసా సీఎం, కేరళ సీఎం, పక్క రాష్ట్రాల మంత్రులు కూడా వైయస్‌ జగన్‌ను పొగిడారు.
మనం బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రోజు కూడా స్కోచ్‌ అవార్డులు ప్రకటించారు. సుపరిపాలనలో మన జగనన్న  ప్రభుత్వం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. వరుస రెండో ఏడాది మన ప్రభుత్వం మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. గ్రామీణాభివృద్ధి, శాంతిభద్రతలు, జిల్లా పరిపాలన, వ్యవసాయ విభాగాల్లో మన రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. అందుకే అందరూ అంటారు. తిరుపతిలో మా వెంకన్న ఫేమస్‌..బెజవాడలో మా కనకదుర్గమ్మ ఫేమస్, వైజాగ్‌లో సింహాద్రి అప్పన్న ఫేమస్, సుపరిపాలనలో మా జగనన్న ఫేమస్‌ అని చాలా సంతోషంగా చెబుతున్నాను.చాలా మంది పచ్చకామెర్లు ఉన్నవారు..బయట ఉన్నపచ్చ బ్యాచ్, పచ్చ తోలు కట్టుకున్న వారికి ఈ లెక్కలు చాలా అవసరం. పొద్దున లేస్తే చాలు వైయస్‌ జగన్‌కు పరిపాలించడం రాదు అని మాట్లాడుతుంటారు. వారికి చెబుతున్నాను. సుపరిపాలనకైనా, సమగ్రాభివృద్ధి అయినా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని తెలుసుకోవాలని ఎమ్మెల్యే రోజా సూచించారు.
 గన్‌ పట్టుకున్న వంద మంది వేస్ట్‌వాళ్లకంటే గన్‌ లాంటి ఒక్కరు ఉంటే చాలు అంటారు. ఆ గన్‌ లాంటి వ్యక్తి మా జగనన్న. 
నిజమైన వేస్ట్‌గాళ్ల పాలన మాకొద్దని ప్రజలు తరిమికొట్టి మా జగనన్నకు 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైయస్‌ జగన్‌తన సుపరిపాలనతో దేశంలోనే బెస్ట్‌ సీఎంగా కొనియాడే స్థితికి వచ్చారు. వైయస్‌ జగన్‌కు మంచి మనసు ఉండటం వల్లే మన రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలు అమలు చేస్తున్నారు. చెప్పిన డేట్‌కు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ..లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు.
ర్యాంకులు, అవార్డులు ఊరికే రావు. జగనన్న మూడేళ్ల పాలనలో వేసిన ప్రతి అడుగుకు ఈ రోజు ఫలితం దక్కుతోంది. అమ్మ ఒడి నుంచి ఆసరా వరకు, వైయస్‌ఆర్‌ చేయూత నుంచి చేదోడు వరకు, ఇళ్ల పట్టాల నుంచి పక్కా ఇళ్ల వరకు, విద్యా దీవెన నుంచి విద్యా కానుక వరకు, గోరుముద్ద నుంచి సంపూర్ణ పోషణ వరకు,ఆరోగ్యశ్రీ నుంచి నాడు–నేడు వరకు ప్రతి పథకం ఓ నూతన పంథా. వైయస్‌ జగన్‌ పథకాలతో ఈ రోజు రాష్ట్రానికి ఇన్ని పతకాలు వచ్చాయి. వైయస్‌ జగన్‌ సుపరిపాలన..సూపర్‌ పాలన అని ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్నారు.
గత మూడేళ్లలో వైయస్‌ జగన్‌ రూ. 1,32,126 కోట్లను 25 డీబీటీ పథకాల ద్వారా అందించారు. ఇందులో బీసీలకు రూ.63,327 కోట్లు, ఎస్సీలకు రూ.21,531 కోట్లు, ఎస్టీలకు రూ.6847 కోట్లు, మైనారిటీలకు రూ.5,160 కోట్లు, కాపులకు రూ.11572 కోట్లు, ఇతరులకు రూ.23,686 కోట్లను అందించారు.
రాష్ట్ర చరిత్రలో సంక్షేమ పథకాల రూపంలో ఇన్ని వేల కోట్ల అందించిన ఘనత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిదే. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇన్ని వేల కోట్లు పేదలకు నేరుగా అందించిన ఘనత వైయస్‌ జగన్‌కే దక్కుతుంది. అందుకే ఇది సుపరిపాలన అని అందరూ చెప్పుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్‌కు అసలైన అబ్రివేషన్‌ ఎలా ఉంటుందో ఈ రాష్ట్రానికే కాదు దేశానికి వైయస్‌ జగన్‌ చాటిచెబుతున్నారు. ఈ పథకాలు ప్రవేశపెట్టడం ఓ ఎత్తు అయితే..ఆ పథకాలను మారుమూల పల్లెల్లోని ప్రతి ఇంటికి తలుపుతట్టి ఇవ్వడం ఒక ఎత్తు. ఈ రోజు గ్రామ సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఎవరూ కూడా కలలో కూడా ఊహించని విధంగా ఇంటింటికి ప్రభుత్వ పథకాలనుఅందించే గొప్ప ఆలోచన చేశారు. ఎక్కడో కొండల్లో ఉండే గిరిజనులకు సైతం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పథకాలు గడప వద్దే అందిస్తోంది. ఇది కాదని ఎవరైనా నిరూపించగలరా? అని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే రోజా సవాలు విసిరారు.
టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని సామాన్యుల గుమ్మానికి కనెక్ట్‌ చేసిన మాస్టర్‌ మైండ్‌ మా జగనన్నదని గర్వంగా చెప్పగలను. 
టెక్నాలజీని వాడి పరిపాలనలో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చిన్నవాడైనా అందరు సీఎంలకు ఆదర్శంగా నిలిచిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కే దక్కింది.
చంద్రబాబు పాలనలో ఎప్పుడు చూసినా టెక్నాలజీ అంటుండేవారు. ఆ టెక్నాలజీని దేనికి వాడారో ఇప్పుడు అర్థమవుతుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి చంద్రబాబు ఫోన్‌ట్యాపింగ్‌ బండారాన్ని బయటపెట్టింది. ఎంత సిగ్గు చేటో ఆలోచన చేయండి. ఈయన నాయకత్వంలో వాళ్ల పార్టీ వాళ్లు ఏమనుకుంటున్నారో చంద్రబాబు ఆలోచన చేయరు. పక్క పార్టీ వాళ్లు ఏమనుకుంటారోనని ఫోన్లు ట్యాప్‌ చేయాలని చూస్తాడు.
చంద్రబాబు పెగాసస్‌ స్పైవేర్‌ కొన్నాడు. జగనన్న మాత్రం ప్రజల కోసం సాప్ట్‌వవేర్‌ వాడారు. టెక్నాలజీతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. జగనన్న ఆర్‌బీకేలతో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. చంద్రబాబు ఫోన్‌ట్యాపింగ్‌ చేయిస్తే..జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. టెక్నాలజీ వాడి చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో బేరాలాడించాడు. వైయస్‌ జగన్‌ టెక్నాలజీతో ప్రతి ఇంటికి 503 సేవలను అందించారు. సెల్‌ఫోన్‌తోనే కోవిడ్‌ సేవలు అందించారు. అందుకే అంటారు..టెక్నాలజీతో చంద్రబాబు ట్యాపింగ్‌ సెట్టర్‌ అయితే..జగనన్న ట్రెండ్‌ సెట్టర్‌ అంటారు. 
ఈ మధ్య రష్యా–ఉక్రెయిన్‌ జరుగుతుంది. అక్కడున్న మన తెలుగు విద్యార్థులతో చ ంద్రబాబు జూమ్‌లో మీటింగ్‌ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులకు మాకు భయంగా ఉందని, శబ్ధాలు వినిపిస్తున్నాయని చెప్పగానే ఈ చంద్రబాబు ఫైలెట్‌ పట్టాభిని రంగంలోకి దించారు. గూగుల్‌లో బాంబులు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టమన్నారట. ఈ టెక్నాలజీని చూసిన ప్రజలు రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటు వెళ్లారు. ఇది చంద్రబాబుకు టెక్నాలజీపై ఉన్న అవగాహన. టెక్నాలజీతో సెల్‌ఫోన్‌ కనిపెట్టాను. వీధి లైట్లు వెగిలించానని , అమరావతిలో ఎండలు తగ్గించానని చంద్రబాబు చెప్పేవాడు. వినేవాడుంటే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఆయనవి అన్ని ఒట్టిమాటలే. టెక్నాలజీని పరిపాలనకు అనుసంధానం ఎలా చేయాలో ఈ తరానికి పరిచయం చేసి బావి తరాలకు బాటలు వేసి భారత దేశానికే  ఆదర్శంగా నిలిచింది మన జగనన్న పాలన అని ఈ రోజు గర్వంగా చెప్పగలను. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు చంద్రబాబు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ 420 హిస్టరీ. జగనన్న త్రీ ఇయర్స్‌ ఇండస్ట్రీ 543 సర్వీసెస్‌ హిస్టరీ అంటున్నారు. కొందరు చేతిరాతలను నమ్ముకుంటారు. కొందరు చేతలను నమ్ముకుంటారు. మన జగనన్న తన చేతులతో ఈ రాష్ట్రంలోని ప్రజల చేతిరాతలను మార్చేస్తున్నారు. ఈ మూడేళ్లలో ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలు అందించారో..ఈ బడ్జెట్‌లోని పథకాలను కూడా అందజేస్తారని నమ్ముతున్నాను. రాష్ట్రంలో డీబీటీ ద్వారా రూ.1.32 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా అందించిన జగనన్న ఈ బడ్జెట్‌లో కూడా డీబీటీ పథకాల కోసం రూ.48,802 కోట్లు కేటాయించడం జగనన్న కమిట్‌మెంట్‌కు నిదర్శనం. ఈ బడ్జెట్లో మహిళల అభివృద్ధికి రూ. 55115 కోట్లు అంటే దాదాపుగా 84 శాతం కేటాయించారని ఎమ్మెల్యే ఆర్కే రోజా వివరించారు.

 

Back to Top