అక్షరాస్యత పెంచేందుకు ‘అమ్మఒడి’

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

నగరి: రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. నగరి నియోజకవర్గ పరిధిలోని వై.కుప్పంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రూ.4.32 లక్షలతో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు నోటుబుక్స్‌ పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనవరి 26వ తేదీన అమ్మఒడి పథకం ప్రారంభమవుతుందని, చిన్నారులను పాఠశాలలకు పంపించే ప్రతి తల్లికి రూ. 15వేలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపించాలని సూచించారు. 

 

Read Also: నవరత్నాలతో ప్రతి కుటుంబంలో ఆనందం 

Back to Top