దేశానికే ఆదర్శంగా వైయస్‌ జగన్ పరిపాలన  

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా 
 

 చిత్తూరు: ఏ రాష్ట్రంలో చేయని పనులు ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తూ దేశానికే ఆదర్శంగా పరిపాలన కొనసాగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనియాడారు. చంద్రబాబు నాయుడి సలహాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవసరమేమో గాని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అవసరం లేదని రోజా పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు నాయుడు తనను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి ఆంధ్ర నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం  దురదృష్టకరమని ఎద్దేవా చేశారు.  వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ  అన్ని విధాలా అభినందనీయమని ప్రశంసించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వారిని, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటరీ వ్యవస్థ ఆదర్శనీయంగా పనిచేస్తోందని రోజా కితాబిచ్చారు. రాష్ట్రంలో లో ఏడు వైరస్ ల్యాబ్స్ పెట్టి కరోనా వ్యాధిని కట్టడి చేస్తున్నారని తెలిపారు.  ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీ కింద చేరుస్తూ 12 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా రోజా ధన్యవాదాలు తెలిపారు.

Back to Top