మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బాబు కుట్ర

అంతర్వేది ఘటనలో నిజాలు నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ

ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా

తిరుమల: అంతర్వేదిలో ఆలయ రథం దగ్ధం ఘటనలో నిజాలు నిగ్గుతేలాలని, అందుకే ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబులా పరికిపంద రాజకీయాలు సీఎం వైయస్‌ జగన్‌కు తెలియవన్నారు. తిరుమలలో ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తన పాలనలో 40 ఆలయాలను కూల్చివేశాడని, గోదావరి పుష్కరాల్లో షూటింగ్‌ పేరుతో 29 మందిని పొట్టన పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. బాబు హయాంలో దుర్గగుడి, శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్రపూజలు జరిగాయని, తిరుమలలో వేయి కాళ్ల మండపం కూల్చేశారని గుర్తుచేశారు. కానీ, ఎన్నడూ చంద్రబాబు సీబీఐ విచారణ కోరలేదన్నారు. సీబీఐని రాష్ట్రానికి అవసరం లేదని తీర్మానం చేశాడని మండిపడ్డారు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడని ఫైరయ్యారు. 
 

Back to Top