చంద్ర‌బాబు, లోకేష్ కుడితిలో ప‌డ్డ ఎలుక‌ల్లా కొట్టుకుంటున్నారు

ఎమ్మెల్యే ఆర్కే రోజా

చిత్తూరు: అవినీతి కేసుల్లో టీడీపీ నేత‌లు అచ్చెన్నాయుడు, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అరెస్టు అయితే ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ కుడితిలో ప‌డ్డ ఎలుక‌ల్లా కొట్టుకుంటున్నార‌ని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పేర్కొన్నారు. అవినీతి చేసి అచ్చెన్నాయుడు, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయార‌న్నారు. వీరు నోరు విప్పితే చంద్ర‌బాబు, లోకేష్ బంఢారం బ‌య‌ట‌ప‌డుతుంద‌న్నారు.  అచ్చెన్నాయుడు, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌కు సోప్ వేయ‌డానికి ఆరాట‌పడుతున్నార‌న్నారు.  వారిని మ‌చ్చిక చేసుకునేందుకు అనంత‌పురం, విజ‌య‌వాడ‌కు ప‌రుగులు తీశార‌ని ఎద్దేవా చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top