రైతుల‌కు అండ‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఎమ్మెల్యే ఆర్కే రోజా

అన్న‌దాత‌ల‌కు యంత్ర‌సేవా ప‌థ‌కం కింద ట్రాక్ట‌ర్లు పంపిణీ

చిత్తూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్నాని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నార‌ని చెప్పారు. న‌గరి రూరల్  డామరపాకం గ్రామ‌ సచివాలయం పరిధిలోని రైతు భరోసా కేంద్రం కాశిబుగ్గ పరమేశ్వర సంఘం గ్రూపు స‌భ్యుల‌కు వైయ‌స్ఆర్  యంత్ర సేవ పథకం ద్వారా ప్రభుత్వం అందించిన ట్రాక్టర్, ట్రిట్ల‌ర్స్‌ను ఎమ్మెల్యే రోజా అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..  చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా..రాష్ట్రంలో క‌రువు ప‌రిస్థితులే అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ‌చ్చాక ప్ర‌తి ఏటా స‌మృద్ధిగా వ‌ర్షాలు కురుస్తున్నాయ‌న్నారు. రాయలసీమలో గ్రౌండ్‌ వాటర్‌ పెరిగింద‌న్నారు.  ఏపీలో అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయ‌ని చెప్పారు. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తున్నాయ‌న్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయార‌ని,  అధిక వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తున్నార‌ని తెలిపారు.  నేలకోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిస్తున్నార‌ని వివ‌రించారు.  ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలు ఉపయోగించుకోవాలని సూచించారు.   

తాజా వీడియోలు

Back to Top