బాబు కావాలనే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు 

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా
 

చిత్తూరు : చంద్రబాబు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలకు నష్టం చేసింది చంద్రబాబేనని అన్నారు. గతంలో రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కున్నారని ఆమె ఆరోపించారు. పంట భూములను తగులబెట్టి భయబ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోజా ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాయలసీమ ద్రోహి. రాజధాని తరిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పార‌ని ప్ర‌శ్నించారు.
రాజకీయాల్లోకి మహిళల్ని లాగొద్దని సాక్షాత్తు జాతీయ మహిళా కమిషనే చంద్రబాబుకు చురకలు వేసింది. కర్నూలే రాజధానిగా కావాలని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాట మార్చారు. రాజధానిపై బీజేపీ నేతల యూటర్న్‌ బాధాకరం. స్వలాభం కోసం బీజేపీలో చేరిన సుజనా, సీఎం రమేష్‌కు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలంతా హర్షిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం’అని అన్నారు.

Back to Top