సీఎం వైయస్‌ జగన్‌ సుపరిపాలనకు బద్వేల్‌లో పట్టం కట్టారు

ఎమ్మెల్యే ఆర్కే రోజా

చిత్తూరు:  బద్వేల్‌ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ ఘన విజయం సాధించడం పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం సీఎం వైయస్‌ జగన్‌ సుపరిపాలనకు నిదర్శనమని, బద్వేల్‌ ఓటర్లు సీఎం వైయస్‌ జగన్‌కు పట్టం కట్టి మద్దతుగా నిలిచారన్నారు. బద్వేల్‌లో 2019లో 45 వేల మెజారిటీతో గెలిపిస్తే..ఈ రోజు 92 వేల మెజారిటీ ఇచ్చారంటే సీఎం వైయస్‌ జగన్‌ పాలనకు మార్కులు వేశారన్నారు. చంద్రబాబు..కుప్పంలో నీ వాగుడు చూశాం..ఏ సెంటర్‌లో ఎన్నిక జరిగినా సీఎం వైయస్‌ జగన్‌ సింగిల్‌ హ్యాండ్‌తో మట్టి కరిపిస్తారన్నారు. ఎమ్మెల్యే సీటు కాదు గదా..అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని ప్రజలు తీర్పు ఇచ్చారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top