ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే

చంద్రబాబు ఆర్టీసీని నిర్వీర్యం చేశారు

వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆర్టీసీకి పూర్వవైభవం తెచ్చారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

అమరావతి:   వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, దేశంలో ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీపై జరిగిన స్వల్పకాలీక చర్చలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు.  ఆర్టీసీ 2004కు ముందు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. టీడీపీ హయాంలో చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉండేవారు. మిగతా ఇండస్ట్రీని ఏవిధంగా నిర్వీర్యం చేశారో..అదేవిధంగా ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేశారు. 57 పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మూతపడ్డాయి. ఆర్టీసీని నాలుగు భాగాలుగా విభజించి టీడీపీ అనుయాయులకుఅమ్మేశారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీకి ఎలాంటిమద్దతు ఇచ్చేవారు కాదు. ట్యాక్స్‌ 15 శాతం ఆర్టీసీకి విధించి నిర్వీర్యం చేశారు. 2004లో వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక ఆర్టీసీకి పూర్వవైభవం వచ్చింది. గతంలో ఉన్న పాస్‌లకు 50 శాతంమాత్రమే రియింబర్స్‌మెంట్‌ చేసేవారు. వైయస్‌ఆర్‌ వంద శాతం రీయింబర్స్‌మెంట్‌ చే సింది. వైయస్‌ ప్రభుత్వం ప్రతి ఏటా రూ.500 కోట్లు ఇచ్చి కొత్త బస్సులు కొనుగోలు చేసేలా ప్రోత్సహించారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారు. 5 వేల మంది క్యాజువల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసిన ఘనత వైయస్‌ రాజశేఖరరెడ్డి గారిది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 27 మందిని రెగ్యులర్‌ చేసింది వైయస్‌ఆర్‌ గారే. వైయస్‌ఆర్‌ హయాంలో ఆర్టీసీ అభివృద్ధిబాటలోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష 27 మంది కార్మికులు ఆర్టీసీపై ఆధారపడ్డారు. వైయస్‌ఆర్‌ తరువాత మళ్లీ ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఉద్యోగులు అగమ్యగోచరంగా ఉండేవారు. ఆర్టీసీ కార్మికులపై బాగా ఒత్తిడి ఉండేది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైయస్‌ జగన్‌ పాదయాత్రలో మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే వైయస్‌ జగన్‌ గారు ఓ కమిటీ వేసి..ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. రూ.3600 కోట్లు ప్రభుత్వం బరిస్తోంది. అంత డైనమిక్‌ నిర్ణయం తీసుకోవడం వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమైంది. చంద్రబాబు హయాంలో ఇలాంటి డిమాండ్‌ వస్తే తోసిపుచ్చారు. కరోనా సమయంలో కూడా ఆర్టీసీని మూసివేయాల్సి వచ్చింది. రూ.3800 కోట్లు నష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం సపోర్టు ఇచ్చింది. కరోనా కష్టాల వల్ల అప్పులు తీర్చలేకపోయింది. ఆర్టీసీ యాజమాన్యం కష్టపడి అప్పులు తీర్చాల్సి ఉంది. 
ఖాళీ స్థలాల్లో బీవోటీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామన్నారు. కడప లాంటి నగరాల్లో చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వమే మల్టీ కాంప్లెక్స్‌లు నిర్మించి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే ఆదాయం వస్తుంది. అడ్వజైజ్‌మెంట్ల విషయంలో కూడా ఆదాయం పొందే మార్గాలు ఆన్వేషించాలి. 
ఎలక్ట్రిక్‌ బస్సులు ఇంకా పెద్ద ఎత్తున ప్రవేశపెడితే బాగుంటుంది. ఆర్టీసీకి ఏమాత్రం బరువు, భారం కాదు. హైర్‌ బస్సులు కూడా తీసుకోవాలి. పర్యావరణాన్ని కూడా పరిరక్షించాల్సి ఉంటుంది.
ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల డిసిగ్నేషన్లు తేడా ఉన్నాయి. పైస్థాయిలో ఉన్న ఉద్యోగులకు నష్టం జరుగుతుందని భావనలో ఉన్నారు.కింది స్థాయి ఉద్యోగులకు ఇది నష్టంగా మారింది. ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఈ విషయంపై దృష్టి సారించాలి.
కరోనా సమయంలో 360 మంది ఆర్టీసీ ఉద్యోగులు మరణించారు. ఉద్యోగులే  బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు.స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌కు సంబంధించిన నిధులు వచ్చేలా మంత్రి చర్యలు తీసుకోవాలి.
ఉద్యోగుల విలీనం అయిన తరువాత రెఫరల్‌ ఆసుపత్రుల్లో వైద్యం దొరికేది. ఈహెచ్‌ఎస్‌లో సరిగా వైద్యంఅందడం లేదు. ఇందులో లోపాలను సరిదిద్దాలి.  ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు రూ.1500, 2వేలు మాత్రమే వస్తుంది. అరకొర పింఛన్లతో కుటుంబ పోషణ సాధ్యం కాదు. బీపీఎల్‌కు ఏరకంగా కార్డులు ఇస్తున్నామో ఆ రకంగా బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు ఆర్టీసీ పెన్షనర్లకు అందజేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
 

Back to Top