వైయస్‌ఆర్ జిల్లా: లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పోచిమరెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కమలాపురం నియోజకవర్గ పరిధి పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో మద్దతుగా ఉండాల్సింది పోయి విమర్శలు చేయడం దారుణం. పేద ప్రజల కు సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. సహాయం చేసే వారి మనోధైర్యం కోల్పోయేలా టీడీపీ నేతల ప్రవర్తన ఉంది. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ చూస్తున్నారు. ఎవరి వద్ద విరాళాలు తీసుకోకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్వచ్చందంగా సహాయం చేస్తున్నారు. కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న సవాళ్ళను ఎదుర్కొనే దమ్ము టీడీపీ నేతలకు ఉందా. సహాయం చేసేందుకు టీడీపీ నేతలు ముందుకు రాలేరు కానీ, ప్రభుత్వం పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.